21 అవమానాల తర్వాత అవకాశం దక్కింది.. చంద్రబోస్ కామెంట్స్ వైరల్!

తెలుగులో పాటల రచయితగా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో చంద్రబోస్ ఒకరు.22 సంవత్సరాల వయస్సులోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చంద్రబోస్ కు 1995 సంవత్సరంలో తాజ్ మహల్ సినిమాతో తొలి అవకాశం దక్కింది.

తెలుగులో చంద్రబోస్ ఏకంగా 3600 పాటలు రాశారు.26 సంవత్సరాలుగా పాటల రచయితగా చంద్రబోస్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో చంద్రబోస్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నాన్న స్కూల్ టీచర్ అని అమ్మ బాల్యంలో కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవారని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.మా పెద్దన్నయ్య, వదిన కండక్టర్లు అని రెండో అన్న ముంబైలో పని చేస్తారని చంద్రబోస్ వెల్లడించారు.

అక్కా బావ వరంగల్ లో ఉంటారని పండుగల సమయంలో అక్కాబావ కలుస్తారని చంద్రబోస్ అన్నారు.తాను ఒక పాట బాగా రాశానని సుచిత్ర మెచ్చుకున్నారని తనను బాగా అర్థం చేసుకుంటారని భావించి ఆమెను అర్ధాంగిని చేసుకోవాలని అనుకున్నానని చంద్రబోస్ వెల్లడించారు.

తనకు వనమాలి అనే పేరు ఇష్టం కావడంతో అబ్బాయికి వనమాలి అనే పేరు పెట్టానని కూతురు పుట్టిన సమయంలో వర్షాలు కురవడంతో కూతురుకు అమృతవర్షిణి అనే పేరు పెట్టానని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.ఇంట్లో సుచిత్రను పెళ్లి చేసుకుంటానని చెబితే అమ్మానాన్న ఇద్దరూ ఒప్పుకున్నారని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.ఆఫీసుల చుట్టూ తిరిగే సమయంలో చాలా అవమానాలు ఎదురయ్యాయని చంద్రబోస్ తెలిపారు.

Advertisement

బీటెక్ చదివి పాటలు రాయడం ఏమిటని తనను అవమానించారని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.పాట కూడా వినకుండా తనను అవమానించడంతో బాధ పడ్డానని చంద్రబోస్ వెల్లడించారు.21 అవమానాల తర్వాత సినిమా ఆఫర్లు రావడంతో తనకు సన్మానాలు జరిగాయని చంద్రబోస్ పేర్కొన్నారు.పాటలు రాసే సమయంలో ఎన్నో పద ప్రయోగాలు చేశానని పద ప్రయోగం విషయంలో దర్శకుడు రాఘవేంద్ర రావు నుంచి ప్రోత్సాహం లభించేదని చంద్రబోస్ అన్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు