ఇద్దరు మైనర్ బాలికలపై ప్రేమోన్మాది దాడి.. హైదరాబాద్ లో ఘటన

హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.బాగ్ అంబర్ పేటలో ఇద్దరు మైనర్ బాలికలపై ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు.

బాలికలు ఇద్దరూ ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.అనంతరం విద్యానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల కింద పడి బలవన్మరణం చెందాడని తెలుస్తోంది.

కాగా ప్రేమోన్మాది దాడిలో బాలికలకు స్వల్ప గాయాలు కావడంతో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు