వినాయకుని శరీరంలో ఏ భాగం దేనికి సూచిస్తుందో తెలుసా?

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరు వినాయకుణ్ణి విఘ్నాలు తొలగించే దేవుడిగా పూజలు చేస్తూ ఉంటాం.

అలాగే ఏ పూజ చేసిన మొదట వినాయకుడికి పూజ చేసిన తరవాతే ఏ పూజ అయిన చేస్తూ ఉంటాం.

వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది.అయన శరీరంలో ఒక్కో భాగం దేనికి సూచిస్తుందో చాలా మందికి తెలియదు.

మనం వినాయకుణ్ణి చూడగానే కనిపించే తల రూపం.మనిషి దేహానికి పెద్ద ఏనుగు తల ఉండడం ఎక్కడైనా విచిత్రమే.

తల పెద్దదిగా ఉండటం వలన వినాయకునికి తెలివితేటలు చాలా ఎక్కువ.

Advertisement

తొండం ఎప్పుడు ఓం ఆకారంలో ఎడమవైపుకు తిరిగి ఉంటుంది.ఇలా ఉండటం వలన చంద్రుని శక్తి మన శరీరం ఎడమ భాగంలోకి ప్రసరించి సహనం, ఓర్పు, ప్రశాంతత, సృజనాత్మక శక్తి కలిగేలా చేస్తుంది.అదే తొండం కుడి వైపుకు ఉంటే సూర్య శక్తి శరీరంలోకి ప్రసరించి మోక్షజ్ఞానాలు కలుగుతాయి.

ఒక చేతిలో పద్మం సత్యానికి, జ్ఞానసౌందర్యానికి చిహ్నం కాగా, మరో చేతిలో ఆయుధం గొడ్డలి బంధాలకు నమ్మకాలకు సూచిక.మూడో చేతిలో లడ్డూలు సంతోషానికి,నాల్గో చేతిలో అభయ ముద్ర అనేది భరోసా ఇస్తుంది.

ఏక దంతం ప్రకృతిలోని భిన్నత్వానికి ప్రతీక.వినాయకుని చిన్న కళ్ళు ఏకాగ్రాతకు, శ్రద్ధకు చిహ్నం, పెద్ద చెవులు ఎక్కువగా వినటానికి,చిన్న నోరు తక్కువగా మాట్లాడటానికి, పెద్ద పొట్ట సుఖ దుఃఖాలను సమానంగా తీసుకోవాలని మరియు అపారమైన జ్ఞానసంపదకు నిలయం అని చెప్పుతారు.

నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!
Advertisement

తాజా వార్తలు