ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్న దొంగలు,హెల్మెట్ పెట్టుకొనే లూటీలు

దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలను ప్రవేశపెట్టి భారీ గా జరిమానాలు విధిస్తూ వాహనదారులు రోజుకో గండం కింద గడుపుతున్న విషయం తెలిసిందే.

ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి అని ఎన్ని సార్లు చెబుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు గురై బలై పోతున్నారు.

ఈ క్రమంలో కేంద్ర సర్కార్ కఠిన నిబంధనలను తీసుకువచ్చి వాహనదారులకు చెక్ పెట్టింది.దీనితో ఎప్పుడు ఎలా ఫైన్ లు విధిస్తారో తెలియక వాహనదారులుభయం భయం గా బయటకు వెళుతున్నారు.

అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా.అక్కడకే వస్తున్నా, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి అని అధికారులు ఎన్నిసార్లు సూచిస్తున్నా జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

కానీ బీహార్ లో మాత్రం హెల్మెట్ ధరించే లూటీ లకు కూడా పాల్పడుతున్నారు.అయితే అధికారులు చెప్పేది జనాల సేఫ్టీ కోసం అయితే కొందరు తమను ఎవరూ గుర్తు పట్టకూడదు అని చెప్పి ఇలా హెల్మెట్ ధరించి మరీ లూటీ కి పాల్పడడం విశేషం.

Advertisement

ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో శనివారం చోటుచేసుకుంది.బ్యాంకు లూటీ చేయడం కోసం ఆరుగురు దుండగులు హెల్మెట్ ధరించి ముజఫర్ పూర్ గోబర్సాహి ప్రాంతంలో గల ఐసీఐసీఐ బ్యాంకు వచ్చారు.తుపాకులతో బెదిరించి బ్యాంకులోని రూ.8,05,115 నగదుతో పాటు సెక్యూరిటీ గార్డు రైఫిల్‌ను అపహరించుకుపోయారు.ఇలాంటి లూటీ కి పాల్పడే వారు ముఖానికి మాస్క్ వేసుకొనే లేదంటే స్కార్ఫ్ కట్టుకొనే వస్తూ ఉంటారు.

మరి వీరంతా ఎలాంటి వాహనాలు ఉపయోగించి బ్యాంకు లూటీ కోసం వచ్చారో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా హెల్మెట్ పెట్టుకొని లూటీ లకు సైతం పాల్పడుతున్నారు.

  ఈ ఘటన కు సంబందించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయినా లూటీ చేయడానికి కూడా హెల్మెట్ పెట్టుకొని రావడం తో నెటిజన్లు తమదైన శైలి లో సెటైర్లు వేస్తున్నారు.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు