ఒక వ్యక్తి నిద్రపోతూనే లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలా అంటే..

మనం ఒక్క రూపాయి సంపాదించడానికి నానా కష్టాలు పడుతుంటాం.ఇప్పటికీ పేద, మద్యతరగతి ప్రజలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

ఎంత కష్టపడినా తిండిబట్టకు తప్ప మిగలవు.ఇంకా పిల్లల చదువుల కోసమని.

ఆసుపత్రి ఖర్చుల కోసమని ఇలా చాలా ఖర్చులు వస్తాయి.మనం చేసేవి సరిపోక మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

అయితే ఒక యువకుడు ఎనిమిది గంటలు నిద్రపోతూ లక్షలు సంపాదిస్తున్నాడు.అవునండి మీరు విన్నది నిజమే.అతడు కేవలం నిద్రపోతూనే లక్షలు సంపాదిస్తున్నాడట.

Advertisement

అయితే అది అందరి వల్ల ఇది సాధ్యం కాదు.అతడు మాత్రమే ఈ పని చేయగలడు.

ట్విట్చ్ అనే అప్లికేషన్ ద్వారా అతడు డబ్బులు సంపాదిస్తున్నాడు.ఇది లైవ్ స్ట్రీమింగ్ యాప్.

ఇది ఆన్లైన్ లో ఆడుకునే లైవ్ గేమ్స్ కోసం పనిచేసే ఒక అప్లికేషన్.దీనిని ఉపయోగించుకుని ఒక యువకుడు డబ్బులు సంపాదిస్తున్నాడు.

యాండీ అనే యువకుడు ఈ అప్లికేషన్ ఉపయోగించి ఎక్కువ కష్టపడకుండానే డబ్బులు సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.యాండీ ఈ అప్లికేషన్ లో లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి కెమెరా ముందు మంచిగా నిద్రపోతాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అతడి నిద్ర చెడగొట్టాలని అనుకునే వారు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.అయితే యాండీ ఈ షో లో కేవలం ఎనిమిది గంటలు నిద్రపోతాడు.

Advertisement

ఈ సమయంలోనే అతడి నిద్రను చెడగొట్టేందుకు ప్రయత్నించాలి.ఇందుకోసం ఏవైనా శబ్దాలు చేసికానీ లేదంటే వాయిస్ మెసేజ్ చేసికానీ అతడి నిద్ర చెడగొట్టవచ్చు.

యాండీ నిద్ర భంగం చేయడానికి యూజర్స్ డబ్బును ఎంతయినా చెల్లించవచ్చు.

ఈ నేపథ్యంలో ఒక రోజు యాండీ ఎనిమిది గంటలు నిద్రపోతే ఈ సమయంలోనే తన నిద్రను చెడగొట్టడానికి భారీగా విరాళాలు రావడంతో 16 వేల డాలర్లు సంపాదించాడు.తాను అంత పెద్ద మొత్తం సంపాదించానని యాండీయే స్వయంగా యూట్యూబ్ ద్వారా తెలియజేసాడు.ఇంకా మాట్లాడుతూ.

ఒకరోజు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి నేను అనుకోకుండా నిద్ర పోయాను.లేచి చూసే సరికి నా అకౌంట్ లో భారీ మొత్తంలో డబ్బు ఉండడంతో నేను ఆశ్చర్యపోయాను.

అంతేకాదు నేను కార్ నడిపేటప్పుడు గంటకు కేవలం 16 డాలర్లు మాత్రమే సంపాదించేవాడినని.ఇప్పుడు ఎనిమిది గంటల్లోనే 16 వేల డాలర్లు సందించడంతో నాకు చాలా ఆనందంగా మరియు ఆశ్చర్యంగా కూడా ఉందని యాండీ తెలిపాడు.

అందుకే అంటారు దేనికయినా అదృష్టం అనేది ఉండాలని.

తాజా వార్తలు