అక్షరాలా 2 లక్షల టిక్కెట్లు..స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డు ని నెలకొల్పిన 'పొలిమేర 2 '

ఈ ఏడాది చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న అద్భుతాలు ట్రేడ్ పండితులను సైతం నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.

వరుసగా పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతూ బయ్యర్స్ కి కన్నీళ్లు మిగులుస్తున్న ఈ సమయం లో చిన్న సినిమాలే వారికి ఈ ఏడాది మొత్తం అభయహస్తాన్ని అందచేశాయి.

అలా ప్రస్తుతం మరో చిన్న సినిమా పొలిమేర 2 ( Polimera 2 )బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.రెండేళ్ల క్రితం డిస్నీ + హాట్ స్టార్ ( Disney + Hot Star )లో డైరెక్టుగా విడుదలైన మా ఊరి పొలిమేర( ma vuri polimera ) చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు వస్తాయని మూవీ టీం కూడా అంచనా వెయ్యలేదు.

ఓటీటీ లో విడుదలైన మొదటి భాగం ని ఏ స్థాయిలో జనాలు చూసారో పొలిమేర 2 వసూళ్లను చూసిన తర్వాతే అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.కానీ రెండవ రోజు మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.వాళ్ళ లెక్క ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు దాదాపుగా 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

Advertisement

విడుదలకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించడం ఆశ్చర్యార్థకం.ఈ సినిమాని నిర్మించడానికి కనీసం కోటి రూపాయిల ఖర్చు కూడా ఉండదు.

కానీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే పది కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు క్లోసింగ్ లో వచ్చేలాగా అనిపిస్తున్నాయి.నిర్మాతకి ఏ స్థాయి లాభాలను తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా.

ఇది ఇలా ఉండగా మొదటి రెండు రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయో బుక్ మై షో యాప్ అధికారిక ప్రకటన ఇచ్చింది.

బుక్ మై షో అందించిన డేటా ప్రకారం పొలిమేర 2 చిత్రానికి మొదటి రోజు 48 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి.ఇక రెండవ రోజు అయితే జంప్ మామూలు రేంజ్ లో లేదు.ఏకంగా 66 వేలకు పైగా టిక్కెట్లు కేవలం రెండవ రోజు అమ్ముడుపోయాయట.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఇది సాధారణమైన విషయం కాదు.మొత్తం మీద రెండు రోజులకు కలిపి ఒక లక్ష 14 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయని, నేడు ఆదివారం కావడం తో 80 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశం ఉందని, మొత్తం మీద మూడు రోజులకు కలిపి రెండు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

ఫుల్ రన్ లో 1 మిలియన్ టిక్కెట్లు అమ్ముడుపోతే మాత్రం బయ్యర్స్ కి మామూలు లక్ కాదనే చెప్పాలి.రీసెంట్ సమయం లో స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయి డిమాండ్ లేదట.

తాజా వార్తలు