గత 11 ఐపీఎల్ సీజన్ లలో ఆరంజ్ క్యాప్ విజేతలు వీళ్ళే , ఇందులో భారత ఆటగాళ్లు ఎంతమందో చూడండి...

ఐపీఎల్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసే క్రికెట్ లీగ్ , ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న లీగ్ దాదాపు ఐపీఎల్ ప్రారంభమై 11 ఏళ్ళు అయిపోయి 12 వ ఏటా అడుగులు వేస్తోంది.

ఒకవైపు బ్యాట్స్ మెన్ ల పరుగుల వరద ఇంకో వైపు బౌలర్ల స్వింగ్ స్పిన్ మాయాజాలం.

ఐపీఎల్ లో వ్యక్తిగతంగా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లకు ఆరంజ్ క్యాప్ ని ఇవ్వడం ఆనవాయితీ.అయితే గత 11 ఐపీఎల్ సీజన్లలో ఆరంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్ళేవారో ఒకసారి చూద్దాం.

2008 - షాన్ మార్ష్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( 616 పరుగులు )

మొదటి ఐపీఎల్ బెండన్ మెక్ కల్లమ్ సునామి ఇన్నింగ్స్ 158 పరుగులతో మొదలైంది.అందులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున 11 ఇన్నింగ్స్ లు ఆడిన షాన్ మార్ష్ 68.44 సగటు తో 616 పరుగులు చేసి ఆ ఏడాది అత్యధిక పరుగుల జాబితాలో ప్రథమంగా ఉండి , 2008 ఆరంజ్ క్యాప్ విజేత గా నిలిచాడు.

2009 - మాథ్యూ హేడెన్ - చెన్నై సూపర్ కింగ్స్ ( 572 పరుగులు )

ఆస్ట్రేలియన్ మాజీ ఆట గాడు మాథ్యూ హేడెన్ ఐపీఎల్ లో చెన్నై తరుపున ప్రాతినిధ్యం వహించాడు , ఈ స్టైలిష్ ఓపెనర్ 2 వ ఐపీఎల్ సీజన్ లో 54 సగటుతో 572 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ ని దక్కిచుకున్నాడు.

2010 - సచిన్ టెండూల్కర్ - ముంబై ఇండియన్స్ ( 618 పరుగులు )

భారత స్టార్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 2010 ఐపీఎల్ సీజన్లో యువ క్రికెటర్లకు దీటుగా బ్యాటింగ్ చేసి 48 సగటుతో 618 పరుగులు చేసాడు.ఆరంజ్ క్యాప్ దక్కిచుకున్న మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు.ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.

Advertisement

2011 - క్రిస్ గేల్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( 608 పరుగులు )

మొదటి 3 సీజన్ల కోల్కత్తా జట్టుకు ఆడి పెద్దగా పరుగులేమి చేయని క్రిస్ గేల్ ని 4 వ ఐపీఎల్ సీజన్లో ఆర్ సి బి జట్టు కొనుగోలు చేసింది , ఆ సంవత్సరం క్రిస్ గేల్ ఐపీఎల్ లో చెలరేగిపోయాడు రెండు సెంచరీలతో పాటు 68 సగటుతో 608 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు.

2012 - క్రిస్ గేల్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( 733 పరుగులు )

2011 సీజన్లో మాదిరిగానే 2012 లో చెలరేగిపోయాడు గేల్ , 5 వ ఐపీఎల్ సీజన్లో దాదాపు ఎక్కువగా గేల్ పేరే వినపడింది 59 సిక్సర్ల తో పాటు 61 సగటుతో 733 పరుగులు చేసి వరుసగా 2 వ సారి ఆరంజ్ క్యాప్ ని పొందాడు.

2013 - మైఖేల్ హస్సీ - చెన్నై సూపర్ కింగ్స్ ( 733 పరుగులు )

మైక్ హస్సీ ని క్రికెట్ అభిమానులు " మిస్టర్ క్రికెట్ " అని పిలుచుకుంటారు.2013 లో చెన్నై కి ఆడిన ఈ ఆటగాడి వయస్సు అప్పటికే 35 ఏళ్ళు పైన ఉంటాయి అయిన ఆ సీజన్లో 52 సగటుతో 733 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ ని దక్కించుకున్నారు.

2014 - రాబిన్ ఉతప్ప - కోల్ కత్తా నైట్ రైడర్స్ ( 660 పరుగులు )

రాబిన్ ఉతప్ప 7 వ ఐపీఎల్ సీజన్ల కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ గెలవడం లో కీలక పాత్ర పోషించాడు , ఈ సీజన్లో అతడు వరసగా 8 సార్లు 40 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసాడు , 52 సగటుతో టోర్నమెంట్ లో 660 పరుగులు చేసి ఆరంజ్ క్యాప్ అందుకున్న రెండవ భారత ఆట గాడిగా నిలిచాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి

2015 - డేవిడ్ వార్నర్ - సన్ రైజర్స్ హైదరాబాద్ ( 572 పరుగులు

) ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2015 లో సన్ రైజర్స్ తరుపున ఆడాడు , ఈ సీజన్లో అతడు 572 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.2015 లో కొన్ని మ్యాచ్ లలో వార్నర్ రైజర్స్ ని ఒంటి చేత్తో గెలిపించాడు.

Advertisement

2016 - విరాట్ కోహ్లీ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( 973 పరుగులు )

2016 లో బెంగళూర్ ని ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఘనత విరాట్ కోహ్లీ కే చెందుతుంది.ఈ సీజన్లో కోహ్లీ 16 మ్యాచ్ లలో 4 సెంచరీ లు చేసాడు , గత అత్యధిక పరుగుల రికార్డ్ కన్నా 240 పరుగులు ఎక్కువగా చేసి 81 సగటుతో 973 పరుగులు సాధించి ఆరంజ్ క్యాప్ ని దక్కించుకున్నాడు.

2017 - డేవిడ్ వార్నర్ - సన్ రైజర్స్ హైదరాబాద్ ( 641 పరుగులు )

డేవిడ్ వార్నర్ 2017 ఐపిఎల్ సీజన్లో 641 పరుగులు చేసి రెండవ సారి ఆరంజ్ క్యాప్ ని సొంత చేసుకున్నాడు.

2018 - కేన్ విల్లియమ్సన్ - సన్ రైజర్స్ హైదరాబాద్ ( 735 పరుగులు )

డేవిడ్ వార్నర్ నిషేధానికి గురి కావడం వల్ల 2018 ఐపీఎల్ లో వార్నర్ ఆడలేకపోయాడు , ఆ స్థానం లో సన్ రైజర్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కేన్ విల్లియమ్సన్ జట్టుని ముందుండి నడిపించాడు.11 వ ఐపీఎల్ సీజన్లో రైజర్స్ ఫైనల్ చేరడానికి ముఖ్య పాత్ర వహించాడు.

ఈ సీజన్లో 53 సగటుతో 735 పరుగులు చేసి తొలిసారి ఆరంజ్ క్యాప్ ని అందుకున్నాడు.

తాజా వార్తలు