ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలు ఇవే..

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ సందడే వేరు.సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర సందడి వేరుగా ఉంటుంది.

ముఖ్యంగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కి చాలా నష్టం వాటిల్లింది.ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి.

ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను కథ బాగుంటే టారిస్టునాన్రు.తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట విషయంలో ఇలానే జరిగింది.

ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి కలెక్షన్ల మోత మోగిస్తుంది.మరి మన టాలీవుడ్ లో కరోనా తర్వాత 2022లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Advertisement

కేజిఎఫ్ 2 :

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజిఎఫ్ 2.ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది.ఈ సినిమా 1ఏప్రిల్ 4న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ లెక్కలను మార్చేసింది.

ఈ సినిమా ఇప్పటికే 1186 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి ఈ ఏడాదిలో టాప్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

ఆర్ఆర్ఆర్ :

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు.ఈ సినిమా మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1132 కోట్లు వసూళ్లు చేసి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో సెకండ్ ప్లేస్ సాధించింది.

ది కాశ్మీర్ ఫైల్స్ :

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న రిలీజ్ అయ్యి ఎవ్వరు ఊహించని స్థాయిలో విజయం అందుకుంది.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 340 కోట్లకు పైగానే రాబట్టి టాప్ 3 లో నిలిచింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

బీస్ట్ :

విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసారు.ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా 250 కోట్ల క్లబ్ లో చేరి హైయెస్ట్ వసూళ్ల సినిమాల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది.

Advertisement

గంగూబాయి కతీయవాదీ :

పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించింది.ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.ఈ సినిమా వాల్డ్ వైడ్ గా 190 కోట్ల వరకు రాబట్టింది.

ఈ సంవత్సరం రిలీజ్ అయినా సినిమాల లిస్టులో ఇది కూడా ఉంది.

తాజా వార్తలు