Actor sarath babu : నటుడు శరత్ బాబు బాబు విషయంలో సినిమా ఇండస్ట్రీ ఓడిపోయింది ..!

శరత్ బాబు( Sarath Babu ).ఆముదాలవలస నుంచి వచ్చి అచ్చ తెలుగు హీరో అయిన శరత్ బాబు మద్రాసులో( Madras ) స్థిరపడిపోయాడు.

తొలినాళ్ల నుంచి హీరో గానే మొదలుపెట్టినప్పటికీ ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనను తానే రాజీ చేసుకున్నాడు అందుకే దాదాపు 200 సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఒక్క పాత్ర కూడా గుర్తుంచుకోదగ్గది లేదు.హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో నటించినప్పటికీ కూడా అతనికి రావాల్సిన పేరు ఎందుకో రాలేదని చెప్పాలి.

ఆరుగురు అన్నదమ్ములు ఏడుగురు అక్క చెల్లెలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన శరత్ బాబు చిన్నతనం నుంచి మామూలు జీవితమే గడిపారు.అతడి తండ్రి ఒక హోటల్ నడిపించేవాడు.

వ్యక్తిగత జీవితం ఎప్పుడూ కుదుపులకే గురైంది రమాప్రభతో( Ramaprabha ) పెళ్లి అయినప్పటికీ కూడా ఆ పెద్దగా సాధించింది ఏమీ లేదు 14 ఏళ్ల పాటు కలిసి ఉన్న పిల్లల్ని కనలేదు అది ఒక సహజీవనం మాత్రమే అంటాడు శరత్ బాబు.స్నేహలత( Sneha latha ) అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న వారి జీవితం గురించి ఏ విషయం బయటకు రాలేదు.అలాగే మూడో పెళ్లి కూడా జరిగింది కానీ ఆవిడ పేరు కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడడు.

Advertisement

ఇప్పటికి అతను ఎంతమంది పిల్లల్ని కన్నాడో కూడా క్లారిటీ లేదు.ఇలా ఒక తెరచాప లాంటి జీవితాన్ని గడిపినప్పటికీ కెరియర్ పరంగా మాత్రం కచ్చితంగా తాను చేయాల్సిన పని చేయలేదని చెప్పాలి.

ఒక మైనపు ముద్దలాగా ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవించగల నటన కౌశల్యం అతని సొంతం.

కానీ అలాంటి ఒక హీరో మరియు అందగాడు, నటుడు మంచి సినిమాలు చేయలేకపోవడం అతడి లోపం కాదు.ఖచ్చితంగా అది ఇండస్ట్రీ లోపమే.ఇక కాస్త కూస్తో చెప్పుకోదగ్గ సినిమాలు అంటే సీతాకోకచిలుక, అభినందన, సాగర సంగమం వంటి పేర్లు చెప్పుకోవచ్చు.

తన కెరీర్ మొత్తం మీద మూడు నంది అవార్డులను కూడా అందుకున్నాడు అవి కూడా సపోర్టింగ్ పాత్రల వల్ల.దాదాపు 5 దశాబ్దాల కెరియర్ లో అతను సాధించింది పెద్దగా ఏమీ లేదు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అలా అని కూడబెట్టిన ఆస్తులు కూడా పెద్దగా ఏమీ లేవు.తన కుటుంబం గురించి కూడా ఎవరికి తెలియదు ఇది క్లుప్తంగా శరత్ బాబు యొక్క జీవితం.

Advertisement

తాజా వార్తలు