భోజనం మధ్యలో లేపి దూరంగా కూర్చోవాలని చెప్పారు.. పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు పా రంజిత్( Pa Ranjith ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కబాలి, కాలా,సార్పట్ట, తంగలాన్‌ లాంటి మంచి మంచి సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రంజిత్.

కాగా రంజిత్ తాజాగా తంగలాన్‌( Thangalaan ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలు ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చెన్నై మహానగరం శివారులోని కర్రలపాలెం ( Karralapalem ) ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారట.అమ్మానాన్నలు రైతు కూలీలు.

వారు మొత్తం ముగ్గురం అన్నదమ్ములట.రంజిత్ రెండోవాడట.

Advertisement

అయితే ఎప్పుడు ఇంటి చుట్టూ ఆడుకునే వారట.ఇంకా వారి ఏరియా దాటి కొంచెం ఊర్లోకి వెళితే ఊరు నడి మధ్యలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేదట.

ఒకరోజు రంజిత్ అరుగుపైకి ఎక్కి ఆడుకుంటున్నప్పుడు ఒక పెద్దాయన ఆ రంజిత్ ని కిందికి నిట్టేసాడట.నువ్వాడుకునే చోటు ఇది కాదురా.

అని చేయిచేసుకోబోయాడట.ఏడుస్తూ వెళ్లి నాన్నతో చెబితే మనం అంటరానివాళ్లమయ్యా, అక్కడికి వెళ్లకూడదు అని రంజిత్ తండ్రి అన్నాడట.

అయితే ఆ సమయంలో ఆ విషయం తనకు అర్థం కాలేదని రంజిత్ చెప్పుకొచ్చారు.అలాగే కిరాణా షాప్ కి వెళ్ళినప్పుడు చాక్లెట్ కావాలని డబ్బులు ఇస్తే షాప్ అతను విసిరి కొట్టేవాడట.

రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న ఇద్దరు బాలీవుడ్ హీరోలు...
డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం.. వైరల్ వార్తల్లో నిజమెంత?

ఇక ఊరు తిరణాళ్లు జరిగినప్పుడు రక్ష కట్టమని అంటే అక్కడ ఉండే వాళ్ళు అతన్ని చూసి తిట్టేవారట.అవన్నీ తనకు అర్థం కావడానికి టీనేజీలోకి రావాల్సి వచ్చింది.వాటిని ప్రశ్నించేంత చైతన్యం కావాల్సొచ్చింది.

Advertisement

చైతన్యాన్ని నాకు చదువే ఇచ్చింది అని చెప్పుకొచ్చారు రంజిత్.అయితే చిన్న తరగతుల నుంచి మంచి విద్యార్తిగా గుర్తింపు తెచ్చుకునేవాడట.

టీచర్లు ( Teachers ) ఎంతో ఆదరంగా చూసేవాళ్లట.అయితే ఊళ్లో సహపంక్తి భోజనానికి వెళ్లి కుర్చీలో కూర్చుంటే పైకి లేపి దూరంగా కింద కూర్చోమనే వాళ్లట.

కానీ టీచర్లు వారి తెచ్చుకున్న టిఫిన్‌ బాక్సు నాకు పెడుతుంటే ఆశ్చర్యపోయేవాణ్ణి.

వాళ్ల సూచనతోనే పదో తరగతిలోపే అంబేడ్కర్‌నీ పెరియార్‌ ఈవీ రామస్వామినీ, నల్లజాతి యోధుడు మాల్కం ఎక్స్‌ జీవితాన్నీ చదివాను.ఇన్ని చదివినా ఇంటర్‌ తర్వాత పై చదువులకి వెళ్లేందుకు డబ్బుల్లేక ఆగిపోవాల్సి వచ్చింది.అమ్మానాన్నలతోపాటూ నేనూ రైతు కూలీని( Farmer ) అయ్యాను.

ఒక ఆర్టిస్టు దగ్గర గోడలకి సైన్‌బోర్డులు రాసే పనికెళ్లాను.రెండేళ్లు ఎంతో కొంత సంపాదించుకున్నాక చిత్రలేఖనంపైన ఆసక్తితో మద్రాసు ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో చేరాను.

ఆ జీవితం నన్ను సమూలంగా మార్చింది.ప్రపంచ సాహిత్యాన్నీ, సినిమాలనీ అధ్యయనం చేయించింది అని చెప్పుకొచ్చారు రంజిత్.

ఆ తర్వాత ఎన్నో అవస్థలు పడి, ఎన్నో అవమానాలను కష్టాలను భరించి దర్శకుడుగా మారాను అని ఆయన తెలిపారు.

తాజా వార్తలు