చేనేత కార్మికుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని లేఖ

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం భవనంలో చేనేత కార్మికులు సమావేశం నిర్వహించారు.

ఈసమావేశంలో చేనేత కార్మికులు తీసుకున్న బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఆ లేఖలో సీఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత పరిశ్రమ అచేతనావస్థలో ఉందని, తాము నేసిన వస్త్రాలు అమ్ముడుపోక బీదరికం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్యాంకు రుణాలు కట్టలేని వారికి లాయర్ నోటీసులు పంపించడం వలన కార్మికులు ఆందోళన చెందుతున్నారని, అన్నదాతలను ఆదుకున్నట్లుగా నేతన్నలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంగిశెట్టి లక్ష్మీనారాయణ, ఏలే అశోక్,సింగం కృష్ణ, గుర్రం సత్యనారాయణ, గంజి రాములు,దోనాల శ్రీను,దోర్నాల దాసు, దోర్నాల సత్యనారాయణ, ఎలే యాదగిరి,విడం వెంకటేశం,కర్నాటి నరేష్ తదితర చేనేత కార్మికులు పాల్గొన్నారు.

డ్రగ్స్ నిర్ములనకు అవగాహనా కార్యక్రమం డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం – ఎస్సై డి సుధాకర్
Advertisement

Latest Video Uploads News