నీళ్ళు తక్కువగా తాగితే ఎన్ని ప్రమాదాలో!

మానవశరీరంలో 70% నీరే ఉంటుందని సైన్స్ చెబుతోంది.మన రక్తంలో, కండరాల్లో, ఎముకల్లో నీరు ఉంటుంది.

మెటబాలిజం సరైన ట్రాక్ లో ఉండాలంటే నీరు అత్యవసరం.అందుకే తక్కువ తాగినా, పూర్తిగా నీళ్ళు తాగకుండా ఉండలేం.

రోజుకి 7-8 గ్లాసుల నీరైనా తాగాలి.ఇక నీళ్ళు తక్కువగా తాగితే ఎన్ని ప్రమాదాలో మీరే చూడండి.

* అవసరమైన మోతాదులో నీరు శరీరానికి అందకపోతే బాడి డీహైడ్రేట్ అయిపోతుంది.ఏ పని సరిగా చేయలేరు.

Advertisement

మెల్లిమెల్లిగా అనేకరకాల అరోగ్య సమస్యలు వస్తాయి.* నీరు తక్కువగా తాగితే, శరీరంలో వేడి పెరిగిపోతుంది.

* నీళ్ళు తక్కువగా తాగితే, సాల్ట్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.దాంతో డయబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అలాగే హార్ట్ రేట్ బ్యాలెన్స్‌ తప్పుతుంది.* రక్తానికి నీళ్ళు అవసరం.

సరిపడ నీళ్ళు శరీరంలోకి చేరకపోతే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది.* జీర్ణక్రియకు సహాయపడతుంది నీరు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

నీటి శాతం తగ్గినాకొద్ది జీర్ణక్రియ దెబ్బతింటూ ఉంటుంది.* నీరు తాగే అలవాటు తగ్గిస్తే అది కడుపులో ఎసిడిటికి, ఆల్సర్ కి కారణమవుతుంది.

Advertisement

* చర్మ సౌందర్యానికి కూడా నీరు ఎంతో అవసరం.నీరు తక్కువగా తాగేవారు ఉన్న వయసుకన్నా పెద్దగా కనిపిస్తారు.

* శరీరంలోని మలినాలు మూత్రం రూపంలో బయటకి రావాలంటే నీరు అతిముఖ్యం.కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగాలి.

తాజా వార్తలు