మానవాళిని ప్రమాదంలోకి నెట్టింది.. చైనాపై విచారణ జరపండి: కోర్టులో మిస్సోరి అటార్నీ దావా

కోవిడ్ 19కు సంబంధించిన సమాచారాన్ని దాయడంతో పాటు ఆ వివరాలను ఇతర దేశాలకు పంపడంలో చైనా నిర్లక్ష్యం వహించడంతో మానవాళి భారీ మూల్యం చెల్లించుకుంటోంది.ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల 57 వేల 504 మందికి వైరస్ సోకగా ఉండగా.

1,77,662 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి మూలాలు, వ్యాప్తి గురించి తెలుసుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజూ చెబుతూనే ఉన్నారు.

ఇందుకు మద్ధతు పలుకుతున్న దేశాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.మరో వైపు పలువురు అమెరికన్లు సైతం చైనాపై కోర్టుల్లో దావాలు వేస్తూనే ఉన్నారు.

తాజాగా మిస్సోరీలోని ఓ డిస్ట్రిక్ కోర్టులో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ ఎరిక్ చైనాపై విచారణ కోరుతూ దావా వేశారు.కోవిడ్ 19 వ్యాప్తిపై చైనా సమాచారాన్ని తొక్కిపెట్టిందని, దీనిపై హెచ్చరించిన గూడఛారులను, నిపుణులను అరెస్ట్ చేసిందని ఆయన ఇందులో ఆరోపించారు.

Advertisement

చైనా తీరు కారణంగా మానవ జాతికి ఎనలేని ప్రాణ, ఆర్ధిక నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

వైరస్ వ్యాప్తిని తొలి దశలోనే అడ్డుకునే అవకాశం ఉన్నా చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎరిక్ తన వ్యాజ్యంలో ఆరోపించారు.వైరస్‌పై జరిపిన పరిశోధనలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిందని ఆయన అన్నారు.మనిషి నుంచి మనిషికి కరోనా వ్యాప్తి చెందుతుందని గతేడాది డిసెంబర్‌లోనే ఆధారాలున్నప్పటికీ.

ప్రపంచం ముందు ఈ నిజాన్ని చెప్పలేదన్నారు.అన్నింటికి మించి కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ అనేక మందిని వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు అనుమతించిందని ఎరిక్ అన్నారు.

ప్రజా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టడం, ప్రమాదకర చర్యలకు పాల్పడటం తదితర నేరాల కింద చైనాపై విచారణ జరపాలని కోరారు.కాగా కోవిడ్ 19 కారణంగా 8,19,175 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.45,343 ప్రాణాలు కోల్పోయారు.కోవిడ్ 19 బారినపడ్డ వారి జీవితాలను నిలబెట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.

పెరుగుతోన్న వలసలు.. రిషి సునాక్ చేతికి ‘‘ రువాండా పాలసీ ’’ , ఇక ఎవరూ ఆపలేరన్న యూకే ప్రధాని

Advertisement

తాజా వార్తలు