తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది.ప్రతిరోజూ కూడా రెండు వేలకి దరిదాపుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
అయితే, పక్క రాష్ట్రాలతో పోల్చితే తక్కువే అయినప్పటికీ కూడా రెండు నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,811 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
తాజాగా వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,346 కు చేరింది.
అలాగే, గత 24 గంటల్లో 9 మంది కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందారు.
దీనితో మృతుల సంఖ్య 1,217 చేరింది.ఇక కరోనా నుంచి తాజాగా 2,072 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,83,025 కు చేరింది.
ప్రస్తుతం తెలంగాణలో 26,104 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో 50,469 పరీక్షలు నిర్వహించగా, మొత్తం కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య 35,00,394 కు చేరింది.
ఇక, జిల్లాల వారీగా వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 291, ఆదిలాబాద్ 29, భద్రాద్రి కొత్తగూడెం 81, జగిత్యాల్ 30, జనగాం 31, జయశంకర్ భూపాలపల్లి 2, జోగులమ్మ గద్వాల్ 25, కామారెడ్డి 33, కరీంనగర్ 100, ఖమ్మం 75, కొమరం భీమ్ అసిఫాబాద్ 11, మహబూబ్ నగర్ 42, మహబూబాబాద్ 33, మంచిర్యాల్ 21, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 171, ములుగు 26, నాగర్ కర్నూల్ 27, నల్గొండ 108, నారాయణ్‌పేట్ 14, నిర్మల్ 32, నిజామాబాద్ 35, పెద్దంపల్లి 34, రాజన్న సిరిసిల్ల 30, రంగారెడ్డి 138, సంగారెడ్డి 45, సిద్ధిపేట్ 63, సూర్యాపేట 71, వికారాబాద్ 27, వనపర్తి 35, వరంగల్ రూరల్ 32, వరంగల్ అర్బన్ 62, యాద్రాది భువనగిరి 33 కేసులు నమోదు అయ్యాయి.