రైతులకు మరో తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం !

రాజన్న రాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.ఈ తరుణంలోనే రైతులకు జగన్ సర్కార్ మరో తీపికబురు అందించింది.

 Ysrcp, Cm Jagan, Ap, Andhrapradesh, Jagan,-TeluguStop.com

ప్రస్తుతం సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలకు సైతం ఉచిత పంటల బీమాను అమలు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.దీనికోసం రూ.101 కోట్లను విడుదల చేసి ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీనితో పాటుగా గతేడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు కూడా బీమాను అమలు చేసింది.

కాగా, ఈ-పంటలో నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే ఈ ఉచిత బీమా వర్తిస్తుంది.ఇక , మరోవైపు రాష్ట్రంలో జిల్లాల వారీగా ఏయే పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలన్న వివరాలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది.

అటు జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే ఆధ్వర్యంలో బీమా క్లెయిమ్స్ సమస్యలను పరిష్కరించనున్నారు.

కాగా, వాతావరణ ఆధారిత పంటల బీమా పధకానికి సంబంధించిన క్లెయిమ్స్‌ ను ఏపీఎస్‌డీపీఎస్ / ఐఎండీ / రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్‌ గేజ్‌ స్టేషన్లు ఇచ్చే సమాచారం బట్టి పరిష్కరిస్తారు.

అలాగే , వైఎస్ఆర్ జల కళ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లను కూడా ఉచితంగానే అమర్చాలని జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube