దేశం కాని దేశం లో భారతీయ మహిళ ఎన్నో అపవాదులు ఎదుర్కోవలసి వస్తోంది.
ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు.
ఆమెపై వ్యక్తిగతంగా కేసుని నమోదు చేయించారా లేదా.నిజంగానే ఆ మహిళ తప్పు చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
అందులో భాగంగానే కువైట్ అంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు.ఇంతకీ ఆ మహిళ ఎవరు ఏమి నేరం చేసింది అనే వివరాలలోకి వెళ్తే.
కువైట్ లో ఒక ఇంట్లో పనిమనిషిగా కుదిరిన భారత మహిళ తమ ఇంట్లో ఖరీదైన వాచ్ దొంగతనం చేసిందనే ఫిర్యాదు పోలీసులకి అందించారు.దాంతో కువైట్ పోలీసులు ఆ మహిళా పని చేస్తున్న ఇంటికి వచ్చి యజమానిని విచారించారు.తమ ఇంట్లో పని చేస్తున్న ఆమె దొంగతనానికి పాల్పడిందనే భావిస్తున్నామని మాకు న్యాయం చేయాలని వారు పోలీసులకి తెలిపారు అయితే
దొంగతనం జరిగింది అని చెప్తున్న ఆ వాచ్ ఖరీదు 4 వేల కువైట్ దినార్స్ గా నిర్ధారించారు అంటే భారత కరెన్సీ లో రూ.9.5 లక్షలు అయితే దొంగతనం ఫిర్యాదు మాకు అందిందని అయితే ఈ దొంగతనం ఆమె చేసిందా లేదా అనే కోణంలో కేసుని దర్యాప్తు చేస్తున్నామని ఆ భారతీయ మహిళా కోసం గాలిస్తున్నామని.తప్పు చేయని మహిళా అయితే ఎందుకు కనపడకుండా పోయింది అనే కోణంలో కూడా విచారణ చేపట్టామని కువైట్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy