కువైట్ అగ్నిప్రమాదం : నా మిత్రులను కాపాడుకోలేకపోయా .. కన్నీటి పర్యంతమైన ప్రత్యక్ష సాక్షి

గల్ఫ్ దేశం కువైట్‌( Kuwait Fire Accident )లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోగా .

వీరిలో 45 మంది భారతీయులే.

వారిలోనూ కేరళకు చెందినవారే అత్యధిక మంది.వీరి భౌతికకాయాలు వాయుసేన ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

బాధితుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకరంగా మారింది.ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi )ఆదేశాల మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్( Kirti Vardhan ) కువైట్‌కు వెళ్లారు.

ఆయన అక్కడి పరిస్ధితులను సమీక్షించి .మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు కృషి చేశారు.మరోవైపు కువైట్ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.అలాగే ప్రవాస భారతీయ వ్యాపారవేత్తలు లులూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ రూ.5 లక్షలు, రవి పిళ్లై రూ.2 లక్షల చొప్పున బాధితులకు పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

Advertisement

అయితే కువైట్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న మరింత మంది తన స్నేహితులను రక్షించలేకపోయానని అనిల్ కుమార్( Anil Kumar ) అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.తీవ్రగాయాలతో కువైట్‌లోని ఆసుపత్రిలో అనిల్ చికిత్స తీసుకుంటున్నారు.ప్రమాదం జరిగిన భవనంలోని రెండో అంతస్తులో తాను నివసిస్తున్నానని, విధి నిర్వహణ నేపథ్యంతో తాను ఆ రోజు ఉదయం త్వరగానే నిద్రలేచినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎప్పటిలాగే తాను లేచి వాష్‌రూమ్‌లో ఉన్నానని.ఏదో జరుగుతుందోనని తాను అనుమానించాని, అప్పటికే ఆ ప్రదేశమంతా వేడిగా ఉన్నట్లుగా అనిపించిందని అనిల్ తెలిపారు.ఆ కాసేపటికే భవనం మొత్తం పొగలు వ్యాపించడంతో బయటికి పరిగెత్తానని అనిల్ గుర్తుచేసుకున్నారు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అందులో నివసిస్తున్న వారిని రక్షించాలనే ఉద్దేశంతో అపార్ట్‌మెంట్ తలుపులను కొట్టుకుంటూ వెళ్లానని అనిల్ తెలిపాడు.తన నలుగురు స్నేహితులతో కలిసి మెట్ల మార్గం గుండా భవనంలోంచి బయటపడాలని నిర్ణయించుకున్నామని.

కానీ మెట్ల గది దట్టమైన పొగతో నిండిపోవడంతో సాధ్యం కాలేదని పేర్కొన్నాడు.అప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి దూకాలని భావించామని, ఈ ప్రయత్నంలోనే తన కాలికి గాయమైందని అనిల్ తెలిపారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
వివేక్ రామస్వామి, మస్క్‌ల రూపంలో బీజింగ్‌కు ముప్పు .. చైనా విద్యావేత్త హెచ్చరిక

ప్రమాదం జరిగిన భవనంలో అంతా తనకు బాగా తెలిసినవారేనని, ఎన్నో ఏళ్లుగా అందరం కలిసే ఉంటున్నామని అందుకే వారిని రక్షించాలని అనుకున్నానని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు