ప్రతిరోజు సోషల్ మీడియా( Social media )లో వందల సంఖ్యలో వీడియోలు కొత్తవి వస్తూనే ఉంటాయి.అందులో ముఖ్యంగా కొన్ని రకాల వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
వాటిలో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి.జంతువులలో ఏనుగులు చాలా తెలివైనవని చెబుతుంటారు.
ఏనుగు చూడడానికి భారీ శరీరం ఉన్న అది అవసరం ఉన్నప్పుడు బలం కంటే మెదడును బాగా ఉపయోగిస్తుంది.ఇకపోతే సోషల్ మీడియాలో ఏనుగు( elephant )కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవడం చూసే ఉంటాము.
తాజాగా ఓ ఏనుగు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ వైరల్ వీడియో ఒకటి వివరాలు చూస్తే.
జనాలు నివసిస్తున్న ప్రాంతంలో ఏనుగు రోడ్డుపై నడుస్తూ వస్తోంది.అయితే దారిలో ఆ ఏనుగుకు పనస చెట్టు కనిపించింది.చెట్టుపై ఉన్న పనస పండ్ల( Jack fruit )ని తినాలని అనిపించిందో ఏమో తెలియదు కానీ.ఏనుగు ఆ చెట్టును ఎక్కలేదు కాబట్టి అందుకని చెట్టును కూడా నాశనం చేయకుండా ఏనుగు తన తెలివితేటలను వాడింది.
ముందుగా ఆ పనస చెట్టు దగ్గరికి వచ్చి ఆ పక్కనే ఉన్న ఇంటి పైకప్పు పై రెండు కాళ్ళను పెట్టి చెట్టుకు ఉన్న కాయలను అందుకునేందుకు వీలుగా నిలబడి., ఆ తర్వాత చెట్టుకు ఉన్న పనస పండ్లను తెంపేసింది.
ఇకపోతే ఈ వీడియో ఎక్కడ అనేది మాత్రం ఎక్కడిదన్న విషయం తెలియ రాలేదు.కాకపోతే., ఏనుగు చేసిన పనికి మాత్రం నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోని పంచుకున్న వ్యక్తి ఏనుగులు, ఎలుగుబంట్లు పనస పండ్లను చాలా ఇష్టపడతాయి మీరు అడవికి సమీపం ప్రాంతంలో ఉన్నట్లయితే.
మీ ఇంటి దగ్గర పనస పండ్ల చెట్టు ఉంటే ఆహ్వానం లేని అతిథులు కచ్చితంగా వస్తారు అంటూ ఆయన తెలిపారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని మీరు కూడా ఒకసారి వీక్షించండి.