మోదీ లోగో కాపీ

కాపీ కొట్టడం అనే ప్రక్రియ అన్ని రంగాల్లో ఉంది.విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడితే, రచయితలు వేరేవారి పుస్తకాల్లో నుంచి కాపీ కొడతారు.

పారిశ్రామిక, వస్తూత్పత్తి రంగాల్లో వివిధ రకాల ఉత్పత్తులను కాపీ కొడుతుంటారు.వీటిని నకీలీ అంటారు.

కాపీ, నకిలీ ఇవన్నీ దగ్గర పోలికలు ఉన్నవే.ఇక అసలు విషయానికొస్తే నరేంద్ర మోదీ తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ఓ లోగోను తెలంగాణ ప్రభుత్వం కాపీ కొట్టింది.

మోదీ సర్కారు సృష్టించిన మేకిన్‌ ఇండియా నినాదం చాలా పాపులర్‌ అయింది.సింహం బొమ్మ మీద ఆంగ్లంలో మేక్‌ ఇన్‌ ఇండియా అని ఉంటుంది.

Advertisement

సింహం బొమ్మలో పారిశ్రామిక పరికరాలుంటాయి.ఇదే లోగోను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.

మేక్‌ ఇన్‌ ఇండియా బదులు మేక్‌ ఇన్‌ తెలంగాణ అని ఉంటుంది.రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దీన్ని ఆవిష్కరించారు.

దీనికి సంబంధించి విడుదల చేసిన వీడియోలో తెలంగాణ పరిశ్రమలకు ఎలా అనుగుణంగా ఉందో, పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తాయో మొదలైనవి వివరించారు.ప్రభుత్వం తన అధికారిక లోగోను (రాజముద్ర) తయారు చేసుకున్నప్పుడు పారిశ్రామిక విధానం కోసం లోగో తయారు చేసుకోలేదా? కాపీ కొట్టడం ఎందుకు? మోదీ లోగోకు మించి తయారు చేయలేమని అనుకున్నారో ఏమో.!.

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

తాజా వార్తలు