‘భరత్‌ అనే నేనులో పేరు మార్పుకు డబ్బులిచ్చిన కేటీఆర్’

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాల‌ను, రాజ‌కీయాల‌ను వేరు చేసి చూసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

రాజ‌కీయాల‌పై సినీ తారాలు చూపిస్తున్న ప్ర‌భావం, రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక సినీ రంగంపై చూపెడుతున్న ప్ర‌భావం కూడా అంతా ఇంతా కాదు.

ఈ నేప‌థ్యంలోనే కొన్ని ద‌శాబ్దాలుగా సినీ నాయ‌కులు నేరుగా రాజ‌కీయాల్లో లేకున్నా.రాజ‌కీయ నేత‌లు నేరుగా సినీ రంగంతో సంబందాలు పెట్టుకోకున్నా కూడా.

వీరి ప్ర‌భావం వారిపైనా, వారి ప్ర‌భావం వీరిపైనా ప‌డుతూనే ఉంది.దీనిని కామ‌న్ అని తీసుకున్నా.

సంచ‌ల‌నం అని స‌రిపెట్టుకున్నా.మ‌న ఇష్టంపైనే డిపెండ్ అయి ఉంటుంది.

Advertisement

కానీ, కొన్ని కొన్ని విష‌యాలు వెలుగు చూశాక మాత్రం చాలా సంచ‌ల‌నాల‌కు దారితీస్తోంది.

ఇలాంటి సంచ‌ల‌నమే ఒక‌టి తాజాగా వెలుగు చూసింది.రాజ‌కీయాల‌కు, సినిమాల‌కు మ‌ధ్య ఉన్న అవినాభావ సంబం ధాన్ని ఈ విష‌యం మ‌రోసారి నిరూపించేలా క‌నిపిస్తోంది.ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన పూర్తి పొలిటిక‌ల్ మాస్ మూవీ.

భ‌ర‌త్ అను నేను.హిట్ రేటింగ్‌తో ఆడుతోంది.

సినిమా విడుద‌ల‌కు ముందు నుంచి కూడా దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.ఈ మూవీని పూర్తిగా పొలిటిక‌ల్ యాంగిల్‌లో అందునా సీఎంగామ‌హేష్ పాత్ర‌ను తెర‌పై చెక్కిన తీరుకు మార్కులు భారీగానే ప‌డ్డాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

అయితే, అదేస‌మ‌యంలో విమ‌ర్శ‌లు కూడా ఊపందుకున్నాయి.మూవీ సాధించిన డ‌బ్బుల కంటే కూడా చూపెడుతున్న క‌లెక్ష‌న్లే ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని మొన్నామ‌ధ్య విమ‌ర్శ త‌లెత్తింది.

Advertisement

దీనిని ప‌క్క‌న పెడితే.ఇప్పుడు పొలిటిక‌ల్‌గా మ‌రో సంచ‌ల‌న విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది.

అది కూడా తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి ఈ మూవీకి సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.ఈ మూవీలో హీరో పేరు భ‌ర‌త్‌.

అయితే, ఈయ‌న పేరును భ‌ర‌త్ వెనుక రామ్ అని చేర్చ‌డం వెనుక టీఆర్ ఎస్‌లో నెంబ‌ర్ - 2, మంత్రి కేటీఆర్ హ‌స్తం ఉంద‌ని, రాజ‌కీయ ప్ర‌యోజనాల కోసం కేటీఆర్ ఇలా పేరు మార్పు చేయించాడ‌ని, దీనికిగారు రూ.కోట్ల సొమ్మును చిత్ర యూనిట్‌కు ఆయ‌న అంద‌జేశార‌ని ఆరోపించారు.ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు అటు రాజ‌కీయంగానే కాకుండా సినీ రంగాన్ని సైతం తీవ్ర స్థాయిలో కుదిపేస్తున్నాయి.

మ‌రి ఇది నిజ‌మా? కాదా? అన్న‌ది కేటీఆరే తేల్చాలి.ఆయ‌న స్పంద‌న వ‌స్తేనే కానీ, ఈ వివాదానికి తెర‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

తాజా వార్తలు