టీటీడీ ఈవోగా కేఎస్ జవహర్‌రెడ్డి .. ఉత్తర్వులు జారీచేసిన జగన్ సర్కార్ !

టీటీడీ .తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్‌ రెడ్డి నియమింపబడ్డారు.

కేఎస్ జవహర్‌ రెడ్డిని టీటీడీ కొత్త ఈవో గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.మొన్నటివరకు టీటీడీ ఈవో గా అనిల్ కుమార్ సింఘాల్ భాద్యతలు నిర్వర్తించారు.

అయన అక్టోబర్ 2నే టీటీడీ ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.ఇకపోతే , ప్రస్తుతం కొత్తగా ఈవో గా నియమింపబడిన కేఎస్ జవహర్‌ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా విజృంభణ సమయంలో ఈయన కీలకంగా వ్యవహరించి అన్ని తానై ముందుండి నడిపించారు.ఈయన చేసిన కృషితోనే ప్రస్తుతం కరోనా ఏపీలో కంట్రోల్ అవుతూ వస్తుంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆయనను టీటీడీ ఈవో గా బదిలీ చేసినట్టు తెలుస్తుంది.టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను ఈ మద్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది.

మూడేళ్లకు పైగా ఈవో పదవిలో కొనసాగిన సింఘాల్‌ ను తిరుమల బ్రాహ్మోత్సవాలు ముగిసిన అనంతరం సెప్టెంబర్ 30న రాత్రి ఆయన్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు