ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ తీపికబురు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన విషయం తెలిసిందే.లాక్ డౌన్ వల్ల ఏపీకి ఆదాయం భారీగా తగ్గడంతో జగన్ సర్కార్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం జీతాల్లో కోత విధించడంపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.కోత విధించిన సమయంలో ప్రభుత్వం ఆ వేతనాన్ని తిరిగి చెల్లిస్తుందో లేదో అనే విషయాల గురించి స్పష్టత ఇవ్వలేదు.

తాజాగా తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ సమయంలో కోత విధించిన వేతనాలను చెల్లిస్తామని కీలక ప్రకటన చేసింది.దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సైతం కోత విధించిన జీతాలను తిరిగి చెల్లిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

కొందరు అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయాలను జగన్ కు తెలియజేయగా జగన్ వారికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు.తాజాగా అధికారులతో పెండింగ్ లో ఉన్న జీతాలు, డీఏ బకాయిలపై సమీక్ష నిర్వహించిన జగన్ కీలక ప్రకటన చేశారు.

అధికారులు ఒక డీఏతో పాటు పెండింగ్ లో ఉన్న వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పారు.ఐదు విడతల్లో ప్రభుత్వం పెండింగ్ జీతాలను ఉద్యోగులకు చెల్లించనుంది.

జగన్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.కొందరు ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న మరో రెండు బకాయిలను కూడా విడుదల చేస్తే తమకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వెల్లడిస్తున్నారు.

మరోవైపు గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు