తన సినిమాని పట్టించుకోని సమంత..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఆఫ్టర్ డైవర్స్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.ఇప్పటికీ సమంత తన ఫాం కొనసాగిస్తుందని చెప్పొచ్చు.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా సమంత తమిళంలో ఒక సినిమా చేసింది.విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా కాతువాకుల రెండు కాదల్ సినిమా చేసింది.

ఈ సినిమాలో సమంతతో పాటుగా నయంతార కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.కోలీవుడ్ లో సూపర్ ప్రమోషన్స్ తో ఈ సినిమా రిలీజైంది.

అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సమంతకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కె.ఆర్.కె గా తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు.కానీ తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు.

Advertisement

కనీసం సమంత కూడా కె.ఆర్.కె తెలుగు రిలీజ్ పై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.తెలుగులో సమంతకు ఉన్న క్రేజ్ ని చూసే ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ చేయగా అసలేమాత్రం ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అవుతున్న కె.ఆర్.కె ని ఆడియెన్స్ పట్టించుకోలేదని చెప్పొచ్చు.సమంత ఇక్కడ శాకుంతలం, యశోద సినిమాలు చేస్తుంది.

కె.ఆర్.కె సినిమాను కొద్దిగా ప్రమోట్ చేస్తే రాబోయే సినిమాలకు ప్లస్ అయ్యే అవకాశం ఉండేది.

Advertisement

తాజా వార్తలు