Krishna Mosagallaku Mosagadu Movie: 63 దేశాల్లో విడుదల అయ్యి బాహుబలిని మించి రికార్డ్స్ ని సాధించిన కృష్ణ చిత్రం ఏంటో తెలుసా ?

తెలుగు చిత్ర పరిశ్రమ కృష్ణ మరణంతో తీవ్ర దుఃఖంలో నిండిపోయింది.

టాలీవుడ్ చిత్ర సీమకు మూల స్తంభం గా ఉన్నటువంటి హీరో కృష్ణ తుదిశ్వాస విడవడం ఆయన అభిమానులతో పాటు మహేష్ బాబు కుటుంబానికి కూడా తీరని లోటు అనే చెప్పాలి.

కేవలం హీరో గానే కాకుండా నటుడిగా, నిర్మాతగా ఆయన సినీ ప్రస్థానం ఎంతో ఘనమైనది.టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ కృష్ణకు మాత్రమే ఉంది.

సినిమా ఇండస్ట్రీకి అనేక కొత్త విషయాలను పరిచయం చేసిన వ్యక్తిగా కూడా కృష్ణకి మంచి పేరు ఉంది.కృష్ణ లాంటి మరొక హీరో మళ్లి పుడతాడు అంటే అది నమ్మశక్యం కాని విషయం.

ఇక తెలుగు సినిమా పరిశ్రమకు కౌబాయ్ తరహా అనేక కొత్త విషయాలను కూడా ఆయనే పరిచయం చేశాడు.ఎన్నో రికార్డులకు ఆయన కేంద్ర బిందువు అని చెప్పాలి.

Advertisement

ఇప్పుడంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి కానీ వీటికంటే ముందే ఎన్నో గొప్ప సినిమాలు తీసి టెక్నాలజీని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన హీరోగా కృష్ణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడ్డాడు.ఇప్పుడు రాజమౌళి తీస్తున్న సినిమాలకు సంబంధించిన రికార్డుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఎన్నో ఏళ్ల క్రితమే ఏకంగా 63 దేశాల్లో ఆయన సినిమా విడుదలై మారె హీరోకి సాధ్యం కానీ రికార్డులను బద్దలు కొట్టింది.

అలా కృష్ణ కెరియర్ లో మైలురాయిగా నిలిచిన సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఇది ఒక కౌబాయ్ సినిమా.ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఇది మొట్టమొదటి కౌబాయ్ సినిమా.

మేకనస్ గోల్డ్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఈ సినిమాను తెలుగులో తీయగా అప్పట్లో కాసుల వర్షం కురిపించింది.అప్పటివరకు జానపద, పౌరాణిక సినిమాలకు మాత్రమే అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి హాలీవుడ్ రేంజ్ సినిమా చూపించి మంత్ర ముగ్గులు చేశాడు.

కేవలం ఎనిమిది లక్షల రూపాయలతో తీసిన ఈ సినిమా 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోవడం అప్పట్లో సంచలనం.35 సెంటర్లో విడుదల అయ్యి విజయం సాధించడంతో హిందీ, తమిళ భాషల్లోకి కూడా డబ్ చేశారు.ఆ తర్వాత ఆ ఇంగ్లీష్ లో కూడా ట్రేజర్ హంట్ అనే పేరుతో విడుదలైంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఇక ప్రపంచ వ్యాప్తం గా మొత్తంగా 63 దేశాల్లో విడుదల అయ్యి గొప్ప చిత్రం గా విడుదల అయ్యింది.

Advertisement

తాజా వార్తలు