తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ ను ఎదిరించి నిలిచిన ఒకే ఒక్కడు సూపర్ స్టార్ కృష్ణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎన్టీఆర్ గతంలో అల్లూరి సీతారామరాజు సినిమా ను చేయాలని భావించాడు.
ఎన్టీఆర్ చేయాలని అనుకోవడం తో ఆ సినిమా ను మరెవ్వరు కూడా చేయలేదట.కానీ కృష్ణ మాత్రం తాను చేస్తానంటూ ముందుకు వచ్చాడు.
ముందుకు రావడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ సన్నిహితులు వద్దంటూ వారించినా కూడా ఊరుకోలేదు.ఎన్టీఆర్ కూడా మధ్య వర్తిత్వం నెరిపి తాను చేయాలనుకుంటున్న సినిమాను నువ్వు ఎలా చేస్తావు అంటూ వారించే ప్రయత్నం చేశాడట.
అయనా కూడా అల్లూరి సీతారామరాజు సినిమాను పూర్తి చేయడం జరిగింది.ఆ సినిమా అద్భుత విజయం సాధించడం తో ఎన్టీఆర్ తోనే ప్రశంసలు దక్కించుకున్నాడు.ఇక సింహాసనం సినిమా తో పాటు ఎన్నో సినిమా ల్లో నేరుగా ఎన్టీఆర్ ను విమర్శించే విధంగా డైలాగ్స్ పెట్టడం తో పాటు సన్నివేశాలను మరియు ఎన్టీఆర్ ను పోలిన పాత్రల ను పెట్టడం ద్వారా ఎన్టీఆర్ కు సవాల్ అన్నట్లుగా నిలిచాడు.ఇక ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ప్రారంభించిన సమయంలో చాలా మంది ఇండస్ట్రీ వారు ఆయన మార్గం లో నడిచారు.
కొందరు మాత్రం ఏ పార్టీకి వెళ్లకుండా ఉన్నారు.కానీ కృష్ణ మాత్రం తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా అన్నట్లు గా కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యి.ఆ సమయంలో తెలుగు దేశం పార్టీ పై మరియు ఎన్టీఆర్ పై దుమ్మెత్తి పోసినట్లుగా మాట్లాడాడు.దాంతో ఎన్టీఆర్ మరియు కృష్ణ ల మధ్య వైరం మరింతగా పెరిగింది.
ఎన్టీఆర్ మరియు కృష్ణ లు పైకి చూడ బాగానే ఉన్నట్లుగా అనిపించినా కూడా ఇద్దరి మధ్య వైరం చాలా ఎక్కువ ఉండేంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగేది.