బండ్ల గణేష్ వద్ద 25 లక్షలు నొక్కేసిన కొరటాల శివ..!

ఒక సాధారణ చిన్న కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత అగ్ర నిర్మాతలలో ఒకరిగా మారిన వారిలో ఒకరు బండ్ల గణేష్( Bandla Ganesh ).

చిన్న చిన్న వేషాలు వేసుకునే ఇతనికి పెద్ద సినిమాలను నిర్మించేంత డబ్బులు అకస్మాత్తుగా ఎలా వచ్చింది అని అప్పట్లో అందరూ అనుకున్నారు.

కానీ బండ్ల గణేష్ సినిమాల్లోకి రాకముందు నుండే పెద్ద కోటీశ్వరుడు.ఆయనకీ హైదరాబాద్ లో పెద్ద కోళ్ల ఫామ్ ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద ఫామ్ అది.ఆ ఫామ్ నుండి ఆయనకీ కోట్లలో ఆదాయం లభిస్తుంది.అలా వచ్చిన డబ్బులతోనే నిర్మాతగా మారాడు.

నిర్మాతగా ఆయన తొలి చిత్రం మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన ఆంజనేయులు.ఈ సినిమా తర్వాత ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్ మార్( Teen mar ) అనే చిత్రం చేసాడు.

Advertisement

ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి, నిర్మాతగా ఫెయిల్ అవుతున్నామో అని డీలా పడిన బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ( Gabbar Singh )చిత్రం ఇచ్చాడు.ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో, బండ్ల గణేష్ ని రాత్రికి రాత్రి స్టార్ నిర్మాతని ఎలా చేసిందో మనమంతా చూసాము.ఈ సినిమా తర్వాత వరుసగా బాద్షా, ఇద్దరమ్మాయిలతో, నీ జతగా నేనుండాలి, గోవిందుడు అందరి వాడేలే మరియు టెంపర్ వంటి చిత్రాలు చేసాడు.

ఒక్కటి కూడా గబ్బర్ సింగ్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు, అలా అని భారీ నష్టాలను తెచ్చిన సినిమాలు కూడా ఏమి లేవు.టెంపర్ తర్వాత మళ్ళీ బండ్ల గణేష్ సినిమాలను నిర్మించలేదు.

ఇదంతా పక్కన పెడితే ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది.

అదేమిటంటే గతం లో రామ్ చరణ్ - కొరటాల శివ( Ram Charan - Koratala Shiva ) కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమా ప్రారంభం అయ్యింది.అయితే కథ విషయం లో చాలా అనుమానాలు ఉండడం తో ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది.అయితే ఈ సినిమా ప్రారంభం కంటే ముందే బండ్ల గణేష్ కొరటాల శివ కి పాతిక లక్షల రూపాయిల అడ్వాన్స్ ఇచ్చాడట.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యాక కొరటాల శివ డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడం తో బండ్ల గణేష్ పెద్ద గొడవకి దిగాడని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉండేది.ఈ ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ దానికి సమాధానం చెప్తూ కొరటాల తో నాకు ఎలాంటి గొడవలు లేవు.

Advertisement

కానీ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ కోసం కొరటాల కి పాతిక లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను.ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు.భవిష్యత్తులో నా సినిమా కచ్చితంగా చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు