స్టెప్పులు వేయిస్తున్న రచయిత

కోన వెంకట్‌.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతి శయోక్తి కాదు.

టాలీవుడ్‌ స్టార్‌ రైటర్స్‌లో ఒక్కడైన ఈయన బహుకళల కోవిదుడు.రచయితగానే కాకుండా నటుడిగా కూడా ఇప్పటికే తనను తాను వెండి తెరపై చూపించుకున్న కోన వెంకట్‌ నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించాడు.

త్వరలోనే దర్శకత్వం చేసే ఆలోచనలో కూడా ఉన్నాడు.ఇప్పటికే కొన్ని చిత్రాలకు షాడో దర్శకుడిగా వ్యవహరించాడేనే టాక్‌ కూడా ఉంది.

ఇక ఈయనలో తాజాగా మరో కొత్త రూపం ఆవిష్కృతం అయ్యింది.రచయితగా, నటుడిగా, నిర్మాతగా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన తాజాగా కొరియోగ్రాఫర్‌గా కూడా తన సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నాడు.

Advertisement

ఈయన నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘శంకరాభరణం’ చిత్రంలోని ఒక పాటకు కొరియోగ్రఫీను అందిస్తున్నాడు.ఈ విషయాన్ని ఆ సినిమాలో నటిస్తున్న హీరో నిఖిల్‌ ప్రకటించాడు.

ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను నిఖిల్‌, నందితలపై చిత్రీకరిస్తుండగా, కోన వెంకట్‌ స్టెప్పులేయిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు