సొంతగూటికి కోమటిరెడ్డి.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కామెంట్స్..!!

కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Raj Gopal Reddy ) తాజాగా బిజెపి పార్టీకి రాజీనామా చేసి మళ్లీ సొంత గూటికి చేరడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఒక పార్టీని వదిలి మరో పార్టీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు.

ఒక్కొక్కప్పుడు అవి హద్దులు కూడా దాటుతుంటాయి.అయితే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సొంత పార్టీలోకి రాబోతున్న తరుణంలో ఒకప్పుడు రేవంత్ రెడ్డి ( Revanth reddy ) రాజగోపాల్ రెడ్డి మధ్య జరిగిన తిట్ల పురాణం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇక అసలు విషయం లోకి వెళ్తే.కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు ( Munugode ) లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మరి బిజెపి పార్టీలోకి వెళ్లారు.

కానీ అక్కడ ఈయన పొసగలేక మళ్ళీ సొంత గూటి కి వస్తున్నారు.అయితే ఈయన బీజేపీ పార్టీలోకి వెళ్లిన సమయంలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని చాలా ఘోరమైన తిట్లతో అవమానించారు.

Advertisement
Komatireddy Raj Gopal Reddy In Congress Revanth Reddy Comments Are Viral , Koma

ఇక ఆయన ఏమన్నారంటే.ఒక దుష్టుడు.

దుర్మార్గుడు.నీచుడు.

నికృష్టుడు.నీచ్ కమీన్ కుత్తే.

అమిత్ షా ఇచ్చే కాంట్రాక్టర్ల కు కకృత్తి పడి మరీ సొంత గూడు ని వదిలి బిజెపిలో వెళ్లిన పెద్ద నీచ్ కమీన్ కుత్తే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Komatireddy Raj Gopal Reddy In Congress Revanth Reddy Comments Are Viral , Koma
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఇలాంటి వాడు కడుపుకి అన్నం తింటే వాడికి తల్లి మీద ప్రేమ ఉంటే ఇలాంటి నీచమైన నిర్ణయం తీసుకోడు.అసలు వీడు మనిషేనా అంటూ రాజగోపాల్ రెడ్డి ని చాలా దారుణంగా తిట్టారు.అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ రాజగోపాల్ రెడ్డి కూడా తగ్గకుండా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.

Advertisement

ఓటుకు నోటు కేసులో దొరికిన ఆ దొంగ దగ్గర పనిచేయడం కంటే రాజకీయాలు వదిలేయడం మంచిది.

అసలు అలాంటి బ్లాక్మెయిలర్ దొంగ అయిన రేవంత్ రెడ్డి (R evanth reddy ) కాళ్ల దగ్గర పనిచేయడం వేస్ట్.అలాంటి దొంగ నాయకత్వంలో కాంగ్రెస్ లో పని చేయడం కంటే మరో అవమానం ఉండదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శించారు.అయితే ఒకప్పుడు వీరు తిట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇలాంటి దారుణమైన తిట్లు తిట్టుకున్న ఇద్దరు నాయకులు మళ్లీ ఒకే పార్టీలో కలిసి ఎలా పని చేస్తారు అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు