చంద్రబాబుకి మద్దతు తెలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!

చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఖండిస్తూ ఉన్నారు.

పేరుగాంచిన నగరాలలో ఐటీ ఉద్యోగులు మరియు తెలుగుదేశం పార్టీ క్యాడర్( TDP ) చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు.

హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.చంద్రబాబు అరెస్టు కావటం పట్ల చాలామంది సెలబ్రిటీలు వివిధ పార్టీల నాయకులు స్పందిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Telangana Congress MP Komatireddy Venkat Reddy ) కూడా స్పందించారు.చంద్రబాబు వల్ల హైదరాబాద్ లో ఐటి అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు.

ఆయన వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి.హైదరాబాద్( Hyderabad ) లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.తెలంగాణ( Telangana ) ఏమైనా పాకిస్తానా అని ప్రశ్నించారు.

Advertisement

ఇక ఇదే సమయంలో కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్ళు బాబు కోసం ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇక్కడ అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంది.వారిని అడ్డుకోవడం అన్యాయం.

అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ గత కొద్ది రోజుల నుండి హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు( IT Employees ) తెలుగుదేశం సానుభూతిపరులు నిరసనలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో వారిని ఇటీవల పోలీసులు అడ్డుకోవడం జరిగింది.దీంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని స్పందించడం జరిగింది.

అప్పుడే ముహూర్తం పెట్టేసారా ? మీరు మాములోళ్లు కాదు సామి 
Advertisement

తాజా వార్తలు