తమిళ్ టాప్ 10 హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు..!

సినిమాలు.కొంత మంది ఏండ్ల త‌ర‌బ‌డి శ్ర‌మించిన త‌ర్వాత మంచి పేరును తీకొస్తే.

మ‌రికొంత మంది ఓవ‌ర్ నైట్ స్టార్లుగా మారిపోతున్నారు.సినిమా హిట్స్‌, ఫ్లాప్స్ హీరోల‌తో పాటు డైరెక్ట‌ర్ల జీవితాల‌ను ఎంతో ప్ర‌భావితం చేస్తాయి.

అందుకే సినిమా అవ‌కాశం రావ‌డం ఒక ఎత్తైతే.దాన్ని స‌క్సెస్‌గా మార్చుకోవ‌డం మ‌రోఎత్తు.

అందుకే టైం బాగున్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు హీరోలు.అందుకే మంచి హిట్లు వ‌చ్చిన‌ప్పుడు.

Advertisement

అందినంత డ‌బ్బును అందుకోవాల‌నుకుంటున్నారు.అందులో భాగంగానే త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

1.కార్తి

త‌మిళ‌ సీనియ‌ర్ న‌టుడు శివ‌కుమార్ రెండో కొడుకు కార్తి.త‌న అన్న సూర్య‌, వ‌దిన జ్యోతిక కూడా న‌టులే.అమెరికాలో మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చ‌దివిన ఆయ‌న‌.

సినిమా యాక్టింగ్ కోర్సుల‌ను కూడా చేశాడు.అనంత‌రం ఇండియాకు వ‌చ్చి మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు.

ఆ త‌ర్వాత సినిమా హీరోగా మారాడు.ఇప్ప‌టి వ‌ర‌కు 20కి పైగా సినిమాల్లో న‌టించి టాప్ హీరోగా ఎదిగాడు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఈయ‌న ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయాల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు.అటు ప‌లు యాడ్స్‌లోనూ న‌టిస్తూ డ‌బ్బులు సంపాదిస్తున్నాడు.చైన్నైలో కొత్త హౌస్ కొనుకున్నాడు.దీని ధ‌ర రూ.8 కోట్లు.2011లో రంజ‌నిని పెళ్లి చేసుకున్నారు.వీరికి ఓ కుమార్తె ఉంది.

2.విజ‌య్ సేతుప‌తి

Advertisement

పేద కుటంబం నుంచి వ‌చ్చిన విజ‌య్ సేతుప‌తి.కుటుంబాన్ని పోషించ‌డం కోసం మొద‌ట్లో సిమెంట్ వ్యాపారం చేశాడు.ఈ వ్యాపారంలో లాస్ వ‌చ్చింది.

ముగ్గురు అక్కా చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయాల్సి ఉండ‌టంతో దుబాయ్‌కి వెళ్లాడు.చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ డ‌బ్బు సంపాదించాడు.2003లో ఇండియాకు తిరిగి వ‌చ్చి.ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా ప‌నికి కుదిరాడు.

మ‌రోవైపు సినిమాల్లో ప్ర‌య‌త్నించాడు.తొలుత సినిమాల్లో చిన్న క్యారెక్ట‌ర్లు చేశాడు.

ప‌లు సీరియ‌ల్స్‌లోకూడా న‌టించాడు.అనంతరం మంచి హీరోగా ఎదిగాడు.

బెస్ట్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్, బెస్ట్ విల‌న్, బెస్ట్ హీరో అవార్డులు అందుకున్నాడు.ప్ర‌స్తుతం త‌ను ఒక్కో సినిమాకు 8 నుంచి 12 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు తీసుకుంటున్నాడు.ఇత‌డి ఇల్లు ఖ‌రీదు రూ.10 కోట్ల‌పైనే ఉంటుంది.

3.శివ కార్తికేయ‌న్

ప‌లు టీవీల్లోని రియాలిటీ షోల్లో పాల్గొనే శివ కార్తికేష‌య‌న్.నెమ్మ‌దిగా సినిమాల వైపు త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించాడు.టీవీ యాంక‌ర్‌గా మొద‌లైన త‌న ప్ర‌స్తానం సినీ హీరో, ప్రొడ్యూస‌ర్, పాట‌ల ర‌చ‌యిత‌గా కొన‌సాగుతోంది.తాజాగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా మొద‌లు పెట్టాడు.2012 నుంచి 20 సినిమాల్లో న‌టించిన శివ‌.ఒక్కో సినిమాకు 8 నుంచి 12 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు.చెన్నైలోని త‌న ఇల్లు రూ.3 కోట్ల వ‌ర‌కు ఉంటుంది.

4.ధ‌నుష్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ప్రొడ్యూస‌ర్ అయిన క‌స్తూరి రాజ‌న్ కుమారుడే ఈ ధ‌నుష్.త‌న అన్న సెల్వ రాఘ‌వ‌న్ కూడా ద‌ర్శ‌కుడే.అత‌డే ధ‌నుష్‌ను హీరోగా ప‌రిచ‌యం చేశాడు.

ద‌ర్శ‌కుడు, స్క్రీన్ ప్లే రైట‌ర్, ప్రొడ్యూస‌ర్, ప్లేబ్యాక్ సింగ‌ర్‌గా త‌న స‌త్తా చాటుకున్నాడు.త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ను పెళ్లి చేసుకున్నాడు.

ఇప్పుడు ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు.ధ‌నుష్ ఇంటి ధ‌ర కూడా సుమారు రూ.15 కోట్లు ఉంటుంది.

5.చియాన్ విక్ర‌మ్

50 ఏండ్లు పైబ‌డిన ఈ హీరో ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కు ఏమాత్రం తీసిపోకుండా న‌టిస్తున్నాడు.సూప‌ర్ చాలెంజింగ్ పాత్ర‌లు చేస్తూ సౌత్ ఇండియాలో టాప్ హీరోగా కొన‌సాగుతున్నాడు.అత‌డి సినిమాలంటే ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఆస‌క్తి.

త‌న న‌ట‌న‌కు గుర్తింపుగా ఎన్నో జాతీయ అవార్డులు, గౌర‌వ డాక్ట‌రేట్లు అందుకున్నాడు.త‌న కుమారుడు ధృవ్ ను ఇప్ప‌టికే హీరోగా ప‌రిచ‌యం చేశాడు.

ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు.ఈయ‌న ఇళ్లు కూడా సుమారు 20 కోట్ల రూపాయ‌ల ఖ‌రీదు చేస్తుంది.

6.సూర్య‌

సీనియ‌ర్ త‌మిళ న‌టుడు శివ‌కుమార్ వార‌సుడు ఈ సూర్య‌.తెలుగు, త‌మిళంతో పాటు హిందీలోనూ మంచి న‌టుడిగా గుర్తింపు పొందాడు.త‌న తండ్రి హీరో కావ‌డంతో సూర్య‌కు సినీ అవ‌కాశాలు ఈజీగానే వ‌చ్చాయి.

అయితే త‌న న‌ట‌న‌తో మంచి హీరోగా గుర్తింపు పొంది ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్నాడు సూర్య‌.ఒక్కో సినిమాకు 20 నుంచి 22 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు సూర్య‌.

ప‌లు యాడ్స్‌లోనూ న‌టిస్తూ డ‌బ్బులు సంపాదిస్తున్నాడు.ఈయ‌న ఇంటి ధ‌ర సుమారు రూ.30 కోట్లు.

7.క‌మ‌ల్ హాస‌న్

ఓవైపు భార‌తీయుడు-2లో న‌టిస్తూనే మ‌రోవైపు రాజ‌కీయ పార్టీ స్థాపించి పాలిటిక్స్ చేస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్‌.గ‌తంలోనే సినిమాల‌కు స్వ‌స్తి ప‌లుకుదామ‌నుకున్నా.అభిమానుల కోరిక మేర‌కు ఆ ఆలోచ‌న విర‌మించుకున్నాడు.

అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూనే.రాజ‌కీయాల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నాడు.

సినిమాలోని అన్ని క్రాఫ్టుల్లో ప‌ట్టున్న క‌మ‌ల్.ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు.ఇత‌డి ఇల్లు ధ‌ర సుమారు రూ.30 కోట్లు ఉంటుంది.

8.అజిత్

ద‌క్షిణాది సినీ ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరో అజిత్.మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.సూప‌ర్ హిట్ల‌తో టాప్ హీరోగా కొన‌సాగుతున్నాడు.

క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీ కాంత్ త‌ర్వాత ఎక్కువ మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హీరో అజిత్.వేదాళం సినిమాకు తొలిసారి 42 కోట్ల రూపాయ‌లు తీసుకున్నాడు అజిత్.

ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు 40 నుంచి 50 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు.ఒక్కో యాడ్‌కు సుమారు రూ.3 కోట్లు అందుకుంటున్నాడు.ఈయ‌న ఇల్లు సుమారు రూ.5 కోట్లు ఉంటుంది.

9.విజ‌య్

ఇత‌డి ఫ్యామిలీ కూడా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న‌దే.ఈయ‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌కుడు.త‌ల్లి ప్లేబ్యాక్ సింగ‌ర్‌.

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన విజ‌య్.ప్ర‌స్తుతం టాప్ హీరోగా కొన‌సాగుతున్నాడు.

ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అత్య‌ధిక పారితోష‌కం తీసుకునే హీరో విజ‌య్. ఒక్కో సినిమాకు 45 నుంచి 50 కోట్లు తీసుకుంటున్నాడు.

యాడ్స్‌లోనూ న‌టిస్తున్నాడు.విజ‌య్ ఇళ్ల ధ‌ర‌.50 కోట్ల వ‌ర‌కు ఉంటుంది.

10.ర‌జ‌నీ కాంత్

సౌతిండియాలోనే కాదు.యావ‌త్ భార‌త‌దేశంలో అత్య‌ధిక అభిమానులు క‌లిగి ఉన్న హీరో ర‌జ‌నీకాంత్.ఈయ‌న‌కు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు.

ఫోర్బ్స్ రిచెస్ట్ ఇండియ‌న్ ఆర్టిస్టుల లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు ర‌జ‌నీకాంత్.అత‌డి ఏడాది సంపాద‌న రూ.60 కోట్లు.ఈ మ‌ధ్య‌కాలంలో ఏడాదికి ఒకే సినిమా తీస్తున్న ర‌జ‌నీ కాంత్.ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు.

అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న న‌టుల‌లో ర‌జ‌నీ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.చెన్నై పోయెస్ గార్డెన్‌లో ఉన్న అత‌డి ఇంటి ధ‌ర రూ.35 కోట్లు.

తాజా వార్తలు