ఎన్టీఆర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు 

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు .

ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘట్ కు( NTR Ghat )  జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తన తాతకు నివాళులు అర్పించారు .

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి తరలి వచ్చారు .జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిపోయిన తరువాత నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ( Jr NTR Flexis ) చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ .వాటిని తొలగించాలని ఆదేశించారు.దీంతో ఆ ఫ్లెక్సీలను అక్కడ నుంచి బాలయ్య అనుచరులు  తొలగించారు.

దీనిపై  జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలయ్య పై విమర్శలకు దిగారు.

ఇక ఈ వివాదం రాజకీయంగాను పెద్ద దుమారం రేపింది.తాజాగా ఈ వ్యవహారంపై గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani ) స్పందించారు.ఈ సందర్భంగా చంద్రబాబు, బాలయ్య లపై తీవ్ర స్థాయిలో నాని విమర్శలు చేశారు.

Advertisement

లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే తారక్ కు ఏమైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు.

వెయ్యి మంది బాలకృష్ణలు,  చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమి చేయలేరని నాని అన్నారు.

బాలకృష్ణ ఆదేశాలతోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అభిమానులు తొలగించారని,  ఫ్లెక్సీలను తొలగిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదని , ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు .తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబును( Chandrababu Naidu ) ఎవరూ పట్టించుకోరని నాని అన్నారు .కొడుకును సీఎం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన అని, తండ్రి ని పదవి నుంచి దింపిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైన పడ్డారని మండిపడ్డారు.వాళ్ళది నీచమైన బుద్ధి అని సంచల వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అంటూ నాని ప్రశ్నించారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు