చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన పుట్టింది..కొడాలి నాని

వందమంది పవన్ కళ్యాణ్ లు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిటికెన వేలు కూడా కదల్చలేరని, ఆయన చిల్లర వేషాలు మానుకోవాలని మాజీ మంత్రి కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం డైలాగులు మాని తమను కొడతానన్న చెప్పు జాగ్రత్తగా దాచుకోవాలని,2024 ఎన్నికల కౌంటింగ్ రోజు దాచిన చెప్పుతో ముందు తాను కొట్టుకొని, తన స్థితికి కారణమైన చంద్రబాబును కొట్టాలని కొడాలి నాని సూచించారు.

సిగ్గు లేకుండా తల్లిని దూషించిన వారితో కలిసి నడవడంతోనే పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్ అని తమతో పాటు ప్రజలు కూడా అనుకుంటున్నారన్నారు.పవన్ కు కాపులన్న, ప్రజలన్న ముఖ్యం కాదని జగన్ గద్దె దించడం, చంద్రబాబుకు అధికారం కట్టడమే ముఖ్యమని, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన పుట్టిందని కొడాలి నాని స్పష్టం చేశారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు