మీ జీవితంలోని ఓ అరగంట మీది కాదు అనుకోని రక్తదానం కోసం కేటాయిస్తే చాలు, ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు.
రక్తదానం వలన మీరు కోల్పోయేది ఏమి ఉండదు.
దానం చేసిన రక్తం ఎలాగో మళ్ళీ పుట్టేస్తుంది.మంచి బరువు, ఆరోగ్యంగా ఉన్న ఏ మనిషి అయిన రక్తాన్ని దానం చేయవచ్చు అని మీకు తెలుసు.
కాని రక్తం దానం ఎవరు చేయకూడదో, ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదో మీకు తెలుసా? తెలుసుకోండి.* జ్వరం, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నవారు రక్తాన్ని అప్పుడే డొనేట్ చేయకూడదు.
ఇక జాండిస్, హెపటైటిస్ లాంటివి చూసిన వారు ఓ ఏడాది కాలంపాటు తమ రక్తాన్ని ఇవ్వకపోవడమే మంచిది.* మీకు కాదు, ఒకవేళ మీ భాగస్వామికి బ్లడ్ క్లాటింగ్ సమస్యలు ఉండి, వారితో శృంగారం గనుక చేసినట్లయితే, కనీసం ఓ సంవత్సరం పాటు వారితో శృంగారం చేయకుండా గడిపితేనే రక్తాన్ని దానం చేయవచ్చు.
* టాటూ వేయిన్చుకున్నవారు, కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నవారు, నీడిల్స్ ఉపయోగించి పెర్మనెంట్ ట్రీట్ మెంట్ చేయించుకున్నవారు ఓ నాలుగు నెలల పాటు రక్తాన్ని దానం చేయకూడదు.టాటూ రకరకాల పద్ధతులలో వేస్తారు.
నీడిల్స్ తో వేయించుకుంటే మాత్రం కొన్ని నెలలు ఆగండి.
* స్వలింగ సంపర్కులు కూడా రక్తాన్ని దాన్యం చేయకపోవడమే మంచిది.అలాగే స్వలింగ సంపర్కులతో శృంగారించిన స్ట్రెయిట్ పురుషులు/మహిళలు ఏడాది పాటు రక్తాన్ని ఇవ్వకూడదు.* కొన్నిరకాల మేడిసిన్స్, ఉదాహరణకి ఐసో ట్రయిన్ లాంటివి వాడుతున్నవారు, యాంటి బయోటిక్స్ ఎక్కువ వాడేవారు ఆ మందులు మానేసిన 4-6 నెలల వరకు రక్తాన్ని ఇవ్వకూడదు.
* HIV/HPV ఇంకెలాంటి సుఖవ్యాధులు ఉన్నా, వారు రక్తాన్ని ఇవ్వకూడదు.వారు మరొకరితో శృంగారిస్తేనే ప్రమాదం, అలాంటిది రక్తం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం.
* హిమోగ్లోబిన్ కౌంట్ 13.0 g/dL కంటే తక్కువ ఉన్న పురుషులు, 12.5 g/dL కంటే తక్కువ ఉన్న స్త్రీలు రక్తాన్ని ఇవ్వకూడదు.అలాగే పురుషులైనా, స్త్రీలైనా, హిమోగ్లోబిన్ 20.0 g/dL కంటే ఎక్కువ ఉంటే రక్తాన్ని ఇవ్వకూడదు.* గుండె సంబధిత సమస్యలు ఏవి ఉన్నా, రక్తాన్ని ఇవ్వకూడదు.
సమస్యకి చికిత్స జరిగిన ఆరునెలల దాకా అయినా ఇలాంటి వారు ఆగాల్సిందే.* ఇక చివరగా, సింపుల్ పాయింట్.16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు రక్తాన్ని ఇవ్వకూడదు.అలాగే అండర్ వెయిట్ ఉన్నవారు కూడా రక్తదానానికి దూరంగా ఉంటేనే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy