సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

ఫామ్ హౌజ్ ఫైల్స్ పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

టీఆర్ఎస్ కు ఆదరణ తగ్గుతోందని పదే పదే పాత ముచ్చటే చెబుతున్నారని చెప్పారు.

అమిత్ షా, నడ్డా, బీఎల్ సంతోష్ పై కేసీఆర్ ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు.ఆ విడియోలో ఉన్న వారితో బీజేపీకి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కిరాయి ఆర్టిస్టులతో వీడియో తీసి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ప్రజాస్వామ్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నటించడం హాస్యాస్పదమని వెల్లడించారు.

కేసీఆర్ లో పెరుగుతున్న అభద్రతా భావానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యనించారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు