పెళ్లి చేసుకోండి సక్సెస్ అదే వస్తుంది..కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తాజాగా క అనే సినిమా(Ka Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 31వ తేదీ విడుదల ఊహించని విధంగా సక్సెస్ అందుతుంది.

ఈ సినిమా ఇప్పటికే 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.కిరణ్ సినీ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ కలెక్షన్స్ కావటం విశేషం.

ఈ సినిమా ఊహించని దానికంటే కూడా మంచి సక్సెస్ కావడంతో కిరణ్ అబ్బవరం అలాగే చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే .ఈ కార్యక్రమంలో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.ముఖ్యంగా పెళ్లి (Marriage) గురించి ప్రస్తావనకు రావడంతో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

పెళ్లి తర్వాత అంతా మంచే జరుగుతుందని అందరూ చెబుతూ ఉంటారు.కానీ ఇంత మంచి జరుగుతుందని అసలు ఊహించలేదు.

ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ కాకపోతే కచ్చితంగా పెళ్లి చేసుకోండి సక్సెస్ దానంతట అదే వస్తుంది అంటూ ఈ సందర్భంగా కిరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య(Rahasya) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సినిమా క పెద్ద హిట్ అవ్వడంతో ఈ సక్సెస్ క్రెడిట్ భార్యకు ఇవ్వడం గమనార్హం.

ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు కర్మ సిద్ధాంతం పాయింట్ ని జత చేసి ఓ కొత్త క్లైమాక్స్ తో ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది.సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ సినిమా కూడా ఉండబోతుందని త్వరలోనే  సీక్వెల్ సినిమాని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?
Advertisement

తాజా వార్తలు