నెపోటిజంపై కింగ్ నాగార్జున వైరల్ కామెంట్స్... అసలేమన్నాడంటే?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో తరచుగా వివాదం నడుస్తున్న ఏకైక అంశం నెపోటిజం.

ఈ విషయంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బాలీవుడ్ బిగ్ షాట్ పై సంచలన ఆరోపణలు చేసింది.

తమకు అనుకూలంగా ఉన్న వారికే అవకాశాలు ఇస్తున్నారని, బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చిన వారికి అవకాశాలు లేకుండా చేసి పరిశ్రమను తామేఏలుదామన్నట్టు వ్యవహారిస్తున్నారని కంగనా దుయ్యబట్టిన విషయం తెలిసిందే.అయితే ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కరణ్ జోహార్, అలియా భట్, మహేష్ భట్ లపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది.ఆ ఎఫెక్ట్ ఆలియా సినిమా పై పడింది.

సుశాంత్ మరణంతో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న పరిస్థితులలో అలియా ట్రైలర్ మొత్తం డిస్ లైక్స్ కొట్టి ప్రేక్షకులు తమ నిరసన తెలిపారు.అయితే ఈ నెపోటిజం పై టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా స్పందించాడు.

Advertisement

ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగార్జున నెపోటిజం అనే పదాన్ని నేను ఒప్పుకోనని, ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ గా చేయనుకుంటాడని, డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటాడని అలాగే హీరో తన కొడుకును, కూతురును హీరో, హీరోయిన్లుగా చేయాలనుకోవడంలో తప్పు లేదని నాగ్ కుండబద్దలు కొట్టాడు.నా కొడుకు మీద నాకు ఉన్న ప్రేమను నెపోటిజం అనడం కరెక్ట్ కాదని, వారిలో సత్తా లేకపోతే సినిమా పరిశ్రమలో రానించరని నాగ్ అన్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు