22 అంతస్తు మీద నుంచి దూకిన పిల్లలు.. కానీ అదృష్టం బాగుంది

పిల్ల‌లు అంటేనే వారికి ఏం చేయాలో ఏం చేయ‌కూడ‌దో అస్స‌లు తెలీదు.

అయితే కొన్ని సార్లు వారి ప‌నులు న‌వ్వించే విధంగా ఉంటే మ‌రికొన్ని సార్లు మాత్రం ఏడిపించేస్తుంటాయి.

మ‌నం ఇప్ప‌టికే పిల్ల‌లు వారికి తెలియ‌కుండానే ప్ర‌మాద ఘ‌ట‌న‌ల్లో ప‌డుతున్న‌వి చూస్తున్నాం.కొన్ని సార్లు అపార్టు మెంట్ల‌లో నివ‌సించే వారి పిల్ల‌లు అనుకోకుండా కింద పడిపోతున్న ఘ‌ట‌న‌లు కూడా చూస్తున్నాం.

ఇలాంటివి చూసిన‌ప్పుడైనా పిల్ల‌ల్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌నే విష‌యాన్ని త‌ల్లిదండ్రులు మ‌ర్చిపోతున్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ఘ‌ట‌న‌లో ఇద్దరు పిల్లలు చేసిన ప‌ని అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.వారు 22 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి ప్ర‌మాద‌క‌ర విన్యాసాలు చేశారు.

Advertisement

అంతెత్తున నిల‌బ‌డి రీ ప్రమాదకర రీతిలో నిలబడ‌టం మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తోంది.బిల్డింగ్ రూఫ్ మీద చేస్తున్న విన్యాసాలు చూస్తేనే ఎక్క‌డ కింద ప‌డిపోతారేమో అనే భ‌యం క‌లుగుతుంది.

ఈ ప్రమాద‌ర వీడియో చైనా దేశంలోని హుబీ ప‌ట్ట‌ణంలో చోటుచేసుకుంద‌ని తెలుస్తోంది.దీన్ని చూసినంత‌నే భ‌యం పుట్ట‌క మాన‌దేమో అన్న రేంజ్ లో ఉంది.

22 అంతస్తులంటే ఎంత ఎత్తున ఉంటుందో ఊహించ‌గ‌లం.అంత ఎత్తున ఆ పిల్ల‌లు రూఫ్ మీద నిల‌బ‌డ్డారు.అయితే వారు ఇలా నిల‌బ‌డ్డ స‌మ‌యంలో నిర్భయంగా న‌వ్వుతూ పైకప్పు పైకి దూక‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

కాగా అదృష్ట వ‌శాత్తు పిల్ల‌లిద్ద‌రికీ ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు.వారిద్ద‌రూ క్షేమంగానే ఉన్న‌ట్టు స‌మాచారం.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఇదంతా కూడా అక్క‌డున్న వారు వీడియో తీసి నెట్టింట షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా ఇలా పిల్ల‌ల్ని వ‌దిలేయ‌డం ఏంటని మండిప‌డుతున్నారు.

Advertisement

త‌ల్లి దండ్రులు జాగ్ర‌త్త తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.ఇలాంటివి చూసిన‌ప్పుడు అయినా త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్తగా ఉండాలంటూ కోరుతున్నారు.

తాజా వార్తలు