ఫామ్ హౌస్ తీసుకెళ్తానంటూ కిడ్నాప్‌.. అస‌లు విష‌యం తెలిసి షాక్ అయిన పోలీసులు

ఈ మ‌ధ్య జ‌రుగుతున్న దారుణాల్లో ఎన్ని ట్విస్టులు ఉంటున్నాయో అంద‌రికీ తెలిసిందే.

మొద‌ట అది ఏదో చిన్న నేరం అనుకుని లైట్ తీసుకుంటే చివ‌ర‌కు అందులో ఉన్న పెద్ద నేరాలు తెలిసి జ‌నాల‌తో పాటు అటు పోలీసులు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఇప్పుడు రాజమండ్రిలో జ‌రిగిన కిడ్నాప్ ఉదంతం కూడా ఇదే విధంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.అయితే ఈ కిడ్నాప్ క‌థ వెనుకాల పెద్ద క‌థ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇందులో గుప్తనిధుల వ్యవహారం తెర‌మీద‌కు రావ‌డంతో పోలీసులు కూడా ఈ ట్విస్టుకు షాక్ అయిపోతున్నారు.రాజమండ్రికి నాగపూర్ ప‌ట్ట‌ణం నుంచి ఓ నలుగురు వ‌చ్చారు.

కాగా వీరికి త‌న ఫామ్‌హౌస్ ను చూపిస్తానంటూ హోట‌ల్ య‌జ‌మాని ఓ చోటుకు తీసుకెళ్లారు.తీరా అక్క‌డ‌కు వెళ్లిన త‌ర్వాత త‌న‌కు రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్ప‌డ్డాడు.బెదిరిపోయిన వారు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఫోన్ చేసి విష‌జ్ఞం చెప్పారు.

Advertisement

దీంతో ఆయ‌న రాజమండ్రి పోలీసులకు ఫోన్ చేసి విష‌యం వివ‌రించారు.రంగంలోకి దిగిన పోలీసుల‌కు విచారణలో ఆసక్తికర విష‌యాలు తెలిశాయి.

వీరంతా క‌లిసి గుప్త నిధుల విష‌యంలో మాట్లాడుకుంటుండ‌గా తేడా రావ‌డంతోనే ఇలా ఫోన్ చేశార‌ని స‌మాచారం.ద్వారక తిరుమలకు ప్రాంతంలో నివ‌సించే వ్యక్తితో ఆ న‌లుగురు నాగ‌పూర్ వ్య‌క్తులు రాజానగరం ఫామ్ హౌస్ వ‌ద్ద‌కు వ‌చ్చారు.

అయితే వీరంతా గుప్త నిధుల విషయంలో తేడా రావడంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.గుప్తనిధుల విష‌యంలో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వారు రాజాసింగ్‌కు కిడ్నాప్ విష‌య‌మ‌ని అబ‌ద్ధం చెప్పి ఫోన్ చేశార‌ని తెలుసుకున్నారు.

ఇక వారంద‌రినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు త‌మ స్టైల్ లో విచారిస్తున్నారు.అస‌లు ఈ ముఠా ఎక్కడి నుంచి వ‌చ్చింద‌నే కోణంలో విచారిస్తున్నారు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

ఆ విష‌యం కాస్తా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు