మాస్ మహారాజ్ పై ఖిలాడీ డైరెక్టర్ భార్య దారుణమైన సెటైర్లు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, కోనేరు సత్యనారాయణ నిర్మించారు.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ నేపథ్యం లో ఉన్న హీరో రవితేజ మాట్లాడే విధానం ఎన్నో అనుమానాలకు దారితీసింది.దర్శకుడు రమేష్ వర్మ కు, హీరో రవితేజ కు మధ్య గొడవ జరిగింది అనే గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు రమేష్ వర్మ భార్య స్పందించిన విధానం కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.హీరో రవితేజను ఉద్దేశిస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీలో సెటైరికల్ కామెంట్ చేయడంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన విధానం ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలుగజేసింది.దర్శకుడు రమేష్ వర్మ అలాగే రవితేజకు మధ్యలో ఏదో గొడవ జరిగినట్లు గానే ఉంది.

ఎందుకంటే హీరో రవితేజ స్టేజ్ పైన మాట్లాడుతున్న సమయంలో నిర్మాత కోనేరు సత్యనారాయణ ఉద్దేశిస్తూ మీరు దగ్గ రుండి అన్ని చూసుకోవాల్సింది అని అప్పుడే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అని అన్నారు.ఇక దర్శకుడు మహర్జాతకుడు సినిమా విడుదల కంటే ముందే అతనికి కారు కూడా కొని ఇచ్చారు అంటూ రవితేజ కాస్త భిన్నంగానే మాట్లాడాడు.

ఆపై మిగతా యూనిట్ సభ్యులను మాత్రమే పొగిడాడు రవితేజ.అలాగే నిర్మాత కోసం సినిమా చేయడం జరిగింది అని పదే పదే రవితేజ చాలా బలంగా వివరణ ఇవ్వడంతో దర్శకుడితో రవితేజ కి మధ్య ఏవో విభేదాలు వచ్చాయి అని అందరికీ అర్థం అయి పొయింది.ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే రమేష్ భార్య రేఖ వర్మ రవితేజ పై కామెంట్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో రవితేజ ను ఉద్దేశిస్తూ.చీప్ స్టార్ అని ఒక దర్శకుడు అన్నట్లు వివరణ ఇవ్వడం ఓ వర్గం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

అంతే కాకుండా మరొక స్టోరీలో అయితే అరటి పండు మీకు బాగా వచ్చు అనుకుంటా తియ్యడం.డైరెక్టర్ గారు నెక్స్ట్ టైమ్ క్లాసెస్ తీసుకోండి RT దగ్గర.

Advertisement

అరటి చెట్టు నరికి ఇచ్చినా సరిపోలేదు.RT కి అంటూ స్టోరీలో రవితేజ పేరు క్లారిటీ గా చెప్పకుండా సెటైర్ వేశారు.

తాజా వార్తలు