కేజిఎఫ్ చాప్టర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కేజిఎఫ్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్.ప్రస్తుతం వీరి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి.

ఇక దేశ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది.ఎక్కడ చూసినా కేజిఎఫ్ మేనియా నడుస్తోంది.

ఈ సినిమాలో హీరో యష్ అల్టిమేట్ ఎలివేషన్ సీన్స్ తో పవర్ ఫుల్ డైలాగులు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయని చెప్పాలి.ఈ విధంగా ఈ నెల 14వ తేదీ థియేటర్లో విడుదల అయి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమాఓటీటీలో తన సత్తా చాటడం కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది.సాధారణంగా థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఆరు వారాలకు ఓటీటీలో విడుదల అవుతూ ప్రేక్షకులను మరింత సందడి చేస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ భారీ మొత్తంలో ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాని మే 27వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రసారం చేయనున్నారు.

అమెజాన్ కేజిఎఫ్ చాప్టర్ 2 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ హక్కులను భారీ ధరలకు కొనుగోలు చేశారు.థియేటర్ లో విధ్వంసం సృష్టించిన రాఖీ బాయ్ తొందరలోనే ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ప్రస్తుతం థియేటర్లో 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం వెయ్యి కోట్ల కలెక్షన్లను సునాయాసంగా క్రాస్ చేస్తుందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు