హైదరాబాద్‌లో శుభం పలుకుతున్న రాకీ భాయ్

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేయగా, అది ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాతో హీరో యశ్ అన్ని భాషల్లో ఫేమస్ అయిపోయాడు.ఇక కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తి చేసుకుందని, షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం మైసూరులో షూటింగ్ జరుపుకుంటుండగా, హీరో యశ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇందులో పాల్గొంటున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

దీని తరువాత హైదరాబాద్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో షూటింగ్ ముగుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తోన్నాడు.ఈ సినిమాను తొలుత వేసవిలో రిలీజ్ చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్‌న వాయిదా వేశారు.

మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు