కరోనా నేపధ్యంలో విమాన సర్వీసుల పై కీలక నిర్ణయం.. ?

దేశంలో కరోనా ప్రభావం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుంది.

రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల దీని ప్రభావం అన్నీ రంగాల పై పడే అవకాశం ఉంది.

గత సంవత్సరం ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల దేశం,ప్రజలు ఎంత నష్టపోయారో అందరికి తెలిసిందే.ఈ క్రమంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.

కానీ తెలంగాణలో లాక్‌డౌన్ లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా కోవిడ్ విజృంభిస్తున్నందు వల్ల విమాన సర్వీసుల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.,/br>

ఈ నేపధ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందిస్తూ, ప్రస్తుతం విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదని, కానీ ఏప్రిల్ 1 నుంచి 100 శాతం సర్వీసులను ఓపెన్ చేయాలని భావించామని అయితే, కేసులు పెరుగుతున్న కారణంగా ప్రస్తుతం 80 శాతం సర్వీసులను మాత్రమే నడపాలని నిర్ణయానికి వచ్చినట్లుగా వెల్లడించారు.ఇక విమానాలలో ప్రయాణించే వారు మాస్క్ పెట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు.ఈ నియమాలను ఉల్లఘించిన ప్రయాణికులను నో-ఫ్లైయర్స్ జాబితాలో పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా హర్దీప్ సింగ్ తెలియచేశారు.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు