టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కేసు విచారణ కోసం హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీల సహకారం తీసుకోవాలని సూచించింది.

పేపర్ లీకేజ్ తెలంగాణలో కొత్తగా జరగలేదని ఏజీ కోర్టుకు తెలిపారు.ఇటువంటి ఘటనలు చాలా రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయని వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో ఏజీ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందన్నారు.పరీక్షలను రద్దు చేయడం మంచిదేనన్నారు.

పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేసింది.ఈ క్రమంలో సిట్ నామమాత్రంగా దర్యాప్తు చేస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Advertisement

దీనిపై స్పందించిన హైకోర్టు సిట్ చీఫ్ పేరేంటి? సిట్ లో ఎవరైనా టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ఉన్నారా అని ప్రశ్నించింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు