ఆ వయస్సు వారికి అక్కడ ఉచితంగా హెయిర్ కట్...!

ప్రపంచంలో ప్రస్తుతం ఎవరికి వారు సుఖపడిపోవాలని ఆలోచిస్తున్న రోజులివి.అయితే అక్కడక్కడ సమాజానికి సేవ అందించే వారు కొందరు మన కళ్ల ముందే కనపడుతూ ఉంటారు.

అలాంటి వ్యక్తే కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఒక బార్బర్ షాప్ యజమాని గోపి.ఇకపోతే ఆయన 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకు ఉచితంగా హెయిర్ కట్ చేస్తున్నారు కాబట్టి.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

కొచ్చి ప్రాంతం దెగ్గరలోని కాత్రికాడవు లోని బార్బర్ షాప్ యజమాని గోపి.ఈయన ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తాను ప్రజలకు ఏదోరకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఉచితంగా హెయిర్ కట్ చేయడం మొదలుపెట్టాడు.

కేవలం ఒక షాప్ లోనే మాత్రమే కాకుండా ఆయనకు ఉన్న మూడు బార్బర్ షాపుల వద్ద కూడా ఈ మేరకు ప్రకటన లో ఉంచాడు.అంతే కాదు ఈయన చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా, వృద్ధులకు కూడా ఉచితంగా హెయిర్ కట్ సేవలను అందిస్తున్నాడు.

Advertisement

ఇక ఈ విషయం గురించి గోపి మాట్లాడుతూ.మామూలుగా హెయిర్ కట్ కు వంద రూపాయల వరకు ఛార్జ్ చేస్తామని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలకు జీవించడానికి కష్టంగా ఉందని అటువంటి వారి దగ్గర నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదన్న నేపథ్యంతో ఇటు పిల్లలకు, అటు ముసలి వారికి ఉచితంగా హెయిర్ కట్ సేవలను అందిస్తున్నట్లు గోపి తెలియజేశారు.

అంతేకాదు, హెయిర్ కట్ కోసం వంద రూపాయలు కూడా పూర్తిగా వసూలు చేయమని, హెయిర్ కట్ చేయించుకున్నవారు వారికి ఎంత వీలైతే అంత ఇవ్వమని చెబుతున్నట్లు గోపి తెలియజేశాడు.ఇక ఈ సేవలను కరోనా పరిస్థితి ముగిసే వరకు తాము అందిస్తామని గోపి తెలియజేశాడు.

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో బార్బర్ గోపి తీసుకున్న నిర్ణయంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా ఆయన దయ హృదయాన్ని కూడా అక్కడి ప్రజలు కొనియాడుతున్నారు.

చివరికి మనిషి ఎంత సంపాదించినా తాను పోయే లోపల ఎంత మందికి సహాయం అందించాడన్న విషయం మాత్రమే చూస్తారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు