దుబాయ్ లాటరీలో భారతీయుడికి భారీ జాక్ పాట్...మొత్తం ఎంతంటే...!!!

కళ్ళు చెదిరే లాటరీ ని మీరు గెలుచుకుంటే ఎలా అనిపిస్తుంది.

ఒక్కసారిగా గాల్లో తేలుతూ, పట్టలేని సంతోషంతో, ఆనంద బాష్పాల నడుమ గెలుచుకున్న డబ్బుతో ఏమేమి చేయాలి అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు కదా.

అవును ఇలాంటి అనుభూతినే పొందుతున్నాడు దుబాయ్ లో ఉంటున్న మన భారతీయుడు.కేరళ నుంచీ దుబాయ్ ఉపాది కోసం వెళ్ళిన అతడు అందరి భారతీయులు మాదిరిగానే అక్కడి లాటరీలో తన లక్కును పరీక్షించుకోవాలని భావించాడు.

అదే అతడిని ఇప్పుడు కోటీశ్వరుడిని చేసింది.వివరాలలోకి వెళ్తే.కేరళ నుంచీ దుబాయ్ వెళ్లిన నజరుద్దీన్ అనే వ్యక్తి అక్కడ కొంత కాలం పనిచేశాడు.

కొంత మేర అనుభవం పొందిన తరువాత తిరిగి మళ్ళీ సొంత రాష్ట్రం కేరళకు వచ్చేసి అక్కడ చిన్న పాటి బిజినెస్ పెట్టుకున్నాడు.అయితే దుబాయ్ లో ఉన్న సమయంలో ఎంతో మంది భారతీయులు అక్కడు దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లాటరీ లో గెలుపొందటం చూసి తాను కూడా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు.

Advertisement

గతంలో ఎన్నడూ తనను అదృష్టం వరించక పోయినా నిరాశ చెందకుండా మళ్ళీ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు.ఈ క్రమంలోనే ఆగస్టు 31 న ఆన్లైన్ లో మిలీనియం మిలినియర్ సీరీస్ లో ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు.

ఈ లాటరీ లక్కీ డ్రా ను తాజాగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో నిర్వాహకులు తీశారు.వారు వెల్లడించిన లక్కీ లాటరీ నంబర్స్ లో నజరుద్దీన్ కొనుగోలు చేసిన టిక్కెట్టు 3768 కు బహుమతి రావడంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు.

కలలో కూడా నేను లాటరీ తగులుతుందని అనుకోలేదని, అందరిలా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించానని ఊహించని విధంగా లాటరీ దక్కడం తన అదృష్టమని నజరుద్దీన్ తెలిపాడు.ఇంతకీ అతడు గెలుచుకున్న మొత్తం ఎంతో తెలుసా అక్షరాలా రూ.8 కోట్లు (Rs.7.94 cr )ఈ డబ్బుతో తన ఐటీ బిజినెస్ ను వృద్ది చేస్తానని, పిల్లల చదువులు, వారికి కావాల్సిన వస్తువులు, భార్యకు బంగారం చేయిస్తానని తెలిపాడు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు