కేసీఆర్‌.టార్గెట్... 5 ల‌క్ష‌ల కోట్లట...

కృష్ణా, గోదావరి నదుల్లో 3,855 టీఎంసీల నికర జలాలతో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి స‌స్య‌శ్యామ‌లం చేయ‌నున్న‌ట్లు తెలంగాణా ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు చెప్పారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రెండో వార్సికోత్స‌వ వేడుక‌ల‌లో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ ఉద్యమ ఎజెండా గా ప్ర‌జ‌లు చేసిన పోరాటం ఫ‌లించి రాష్ట్రం సాధించుకున్నామ‌ని, ఇక ప్ర‌గ‌తి దిశ‌గా ప‌రుగులు పెట్టించాల్సిన బాధ్య‌త త‌న‌దేన‌న్నారు.

గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా నీళ్లంద‌క బీడువారిన పొలాల‌కు నీళ్లందించేందుకు వీలుగా సాగు నీటి ప్రోజ‌క్టుల‌ను అవ‌స‌రం మేర‌కు మార్పులు చేసి నిర్మాణం చేస్తున్నామ‌ని, జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తో గొడవలు కోరుకోవడంలేదని ఆయన స్పష్టం చేశారు.తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఇద్ద‌రికీ న‌ష్టం చేకూరుస్తుంద‌ని ఇదే విష‌యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రికీ పదే ప‌దే విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని చెప్పారాయ‌న‌.2019-20 నాటికి తెలంగాణ బడ్జెట్‌ రూ.2లక్షల కోట్లుపైగా ఉండేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నామ‌ని, తెలంగాణలో అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని ప్ర‌తి అవ‌కాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్న‌ట్లు తెఇపారు.రానున్న రోజుల‌లో భార‌త దేశంలోనే తెలంగాణ అగ్ర‌గామి రాష్ట్రంగా నిల‌బ‌డ‌బోతోంద‌ని జోస్యం చెప్పారు కేసీఆర్‌.

తెలిపారాయ‌న‌.ఈ క్ర‌మంలోనే 2024 నాటికి తెలంగాణ బడ్జెట్‌ రూ.5లక్షల కోట్లు దాట‌డ‌మే ల‌క్ష్యంతో ఇప్ప‌టి నుంచి ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారాయ‌న‌.ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్తో పాటు మంత్రి వ‌ర్గ స‌భ్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!
Advertisement

తాజా వార్తలు