టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్ ?  ప్రకటన ఎప్పుడంటే ? 

హుజురాబాద్ ఎన్నికలు రసవత్తరంగా మారిన నేపథ్యంలో, ఇక్కడి నుంచి ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరెవరిని అభ్యర్థులుగా రంగంలోకి దించబోతున్నాయి అనేది ఉత్కంఠ నెలకొంది.

బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తారని అంతా భావించినా, ఆయన భార్య జామున పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇక కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు.ఇక టిఆర్ఎస్ నుంచి అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించబోతున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన, ఎంపికపై అన్ని పార్టీలు కాస్త స్పీడ్ పెంచాయి.ఇదిలా ఉంటే టిఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి విషయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ ప్రభావం కనిపించకుండా చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

పదే పదే తాను బీసీ సామాజికవర్గానికి చెందిన వాడినని రాజేందర్ చెప్పుకుంటూ, ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గాల ఓట్లను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని చూస్తోంది.ముందుగా కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డి పేరు వినిపించినా, ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తూ బుజ్జగించారు.చివరకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ ను కేసీఆర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

శ్రీనివాస్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.ఇక బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకులా భరణం  కృష్ణ మోహన్ రావు, ఎల్ రమణ, మాజీమంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు పురుషోత్తం రెడ్డి, ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి మాలతి, మల్లయ్య, స్వర్గం రవి ఇలా చాలా మంది పేర్లు వినిపించినా, ఇంటెలిజెన్స్, వివిధ సర్వేల్లోనూ శ్రీనివాస్ యాదవ్ అయితేనే గట్టి పోటి ఇవ్వగలరనే రిపోర్ట్ రావడంతో కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపిస్తున్నారట.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ విషయానికి వస్తే, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు.టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్ తో కలిసి అనేక ఉద్యమాలలోనూ పాల్గొన్నారు.

అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కొనసాగుతున్నారు.శ్రీనివాస్ యాదవ్ ను టిఆర్ఎస్ అభ్యర్థిగా ఈ నెల 16న హుజురాబాద్ లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించబోతున్న భారీ బహిరంగ సభలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు