హుజురాబాద్ లో మొదలైన కేసీఆర్ మార్క్ ఆపరేషన్... అదేంటంటే?

హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

దుబ్బాక ఉప ఎన్నిక సందర్బంగా ఎలాగైతే రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారిందో మనకు తెలిసిందే.

ప్రస్తుతం అదే విధంగా ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది.అయితే దుబ్బాకలో ఎలాగైతే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ నెలకొందో ప్రస్తుతం హుజురాబాద్ లో కూడా అదే పరిస్థితి ఉంది.

అయితే దుబ్బాకలో ఉన్న రాజకీయ వాతావరణానికి హుజురాబాద్ లో ఉన్న రాజకీయ వాతావరణానికి చాలా తేడా ఉంది.అంతేకాక దుబ్బాకతో పోలిస్తే హుజురాబాద్ నియోజకవర్గం కంచుకోట.

గత ఇరవై సంవత్సరాలుగా హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుచుకుంటూ వస్తోంది.

Advertisement

కాని ప్రస్తుతం పరిస్థితి మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా లేదు.ఎందుకంటే టీఆర్ఎస్ లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ లేకపోవడం టీఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా మారింది.అయితే కేసీఆర్ మార్క్ ఆపరేషన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

అంతేకాక ఇప్పటికే కేసీఆర్ దూతలు స్థానిక వర్గాల సమీకరణను ఏకం చేసేందుకు హుజురాబాద్ లో వచ్చినట్టు తెలుస్తోంది.అందుకే ఎన్నికల ప్రచార నేతలు ప్రచారంలో నిమగ్నవుతూ స్థానిక విషయాలను చక్కబెడుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు బీజేపీకి, టీఆర్ఎస్ కు మధ్య గెలుపు అవకాశాలు ఉన్నాయి.అయితే కెసీఆర్ మాత్రం హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవబోతున్నదనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికే రెండు, మూడు సర్వేలు చేసిన కెసీఆర్ కొంత టీఆర్ఎస్ వ్యతిరేక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.అయితే చాలా వరకు టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ గెలుపుపై నమ్మకాన్ని కలిగి ఉన్న పరిస్థితి ఉంది, ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక రానున్న రోజుల్లో ఎంత వేడి రాజేస్తుందనేది చూడాల్సి ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు