కేసీఆర్ కేటీఆర్ కు ఏమైంది ? సొంత నేతలనే ఎందుకు బెదిరిస్తున్నారు ?

గతం కంటే ఇప్పుడు టిఆర్ఎస్ లో పరిస్థితులు చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

నాయకులను కట్టడి చేసే ఉద్దేశంతో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా టిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెనుకాడడం లేదు.

తేడా వస్తే తనకు ఎవరైనా ఒకటేనని, తన, మన బేధం చూపించాను అని పదే పదే హెచ్చరిస్తున్నారు.కేసీఆర్ పరిస్థితి అలా ఉంటే ఆయన కుమారుడు కేటీఆర్ వ్యవహారం కూడా అదే విధంగా ఉంది.

సొంత పార్టీ నాయకులను సైతం బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ బెంబేలెత్తిస్తున్నారు.పార్టీలో ఎవరైనా తాము చెప్పినట్లు వినాల్సిందేనని, ఎక్కువ చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు అన్నట్టుగా వారు మాట్లాడడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

ముఖ్యంగా కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాన్ని గురించి చెబుతూ మరింతగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా సొంత పార్టీ అభ్యర్థులకు ఇదే చెప్పారు.కొత్త చట్టం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే క్షమించేది లేదని, కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ చెప్పారు.నాయకులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మానేసి ఎవరి పని వారు సక్రమంగా చేయకపోతే ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా తాను వెనుకాడనని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఆయన కుమారుడు కేటీఆర్ కూడా సిరిసిల్లలో ఇదే విధంగా మాట్లాడారు.

కొత్తగా వచ్చే మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టం చాలా శక్తిమంతమైనవని, ఏ చిన్న తప్పు చేసినా సర్పంచులు, ఎంపీటీసీల పదవులు పోతాయని ఆయన హెచ్చరించారు.క్షేత్రస్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్లు అంటే చాలా చెడ్డ పేరు ఉందని, ఆ పేరు పోగొట్టుకోవాలని, లంచం అనే మాట ఎక్కడా వినిపించకూడదు అని కేటీఆర్ కాస్త గట్టిగానే చెప్పారు.అయితే ఈ ఇద్దరు ఈ విధంగా వ్యవహరించడం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.

తరచుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో మంచి పేరు రావడమే కాకుండా అవినీతి విషయంలో సొంత పార్టీ నాయకులను అయినా ఉపేక్షించమనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్, కేటీఆర్ భావించే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

Advertisement

తాజా వార్తలు