జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు... యూటర్న్ తీసుకున్న కౌశిక్ తల్లి.. ఏం జరిగిందంటే?

ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలను ప్రస్తుతం వరుస వివాదాలు చుట్టుకుంటున్నాయి.ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) వివాదంలో నిలిచారు.

అయితే తాజాగా ఎన్టీఆర్ పట్ల కూడా తన వీరాభిమాని కౌశిక్ ( Kaushik ) తల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఎన్టీఆర్ వీరాభిమాని అయినటువంటి కౌశిక్ అనే కుర్రాడు బోన్ క్యాన్సర్ తో ( Bone Cancer ) బాధపడుతున్నారు అయితే తనకు చికిత్స చేయడం కోసం సుమారు 60 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అందుకోసం ఎవరైనా దాతలు సహాయం చేయాలని ఆయన తల్లి సరస్వతి కోరారు.

ఇక కౌశిక్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో తన అభిమాన హీరో నటించిన దేవర సినిమా చూసేవరకు ఆయన తనని బ్రతికించాలని కోరారు. ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరడంతో ఆయన స్వయంగా వీడియో కాల్ చేసి తన అభిమానితో మాట్లాడటమే కాకుండా తన అభిమాని కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు అయితే ఇప్పటివరకు నాకు ఎన్టీఆర్ నుంచి ఒక రూపాయి కూడా అందలేదని ఆయన ఇచ్చిన మాట తప్పారు అంటూ కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చారు.అయితే ఎన్టీఆర్ టీం హాస్పిటల్ కి చేరుకొని తన కొడుకుకు సంబంధించిన బిల్ మొత్తం పే చేయడంతో ఈమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా కౌశిక్ తల్లి మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.ఎవరైనా నా మాటలు వల్ల అభిమానులు బాధపడి ఉంటే నన్ను క్షమించండి.ఎన్టీఆర్ సార్ గురించి నేనెక్కడ తప్పుగా మాట్లాడలేదు వారు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాను.

Advertisement

ప్రస్తుతం నా కుమారుడు ఇలాగ ఉన్నారు అంటే ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ వల్లే తన కొడుకు క్షేమంగా ఉన్నారని ప్రస్తుతం తన కొడుకు ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని ఈమె తెలిపారు.ఎన్టీఆర్ గురించి ఈమె సాయం అందితే ఒకలాగా అందకపోతే మరోలాగా మాట్లాడటంతో పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈమెపై ఫైర్ అవుతున్నారు.

వెన్నెల కిషోర్ తన ఇన్వెస్టిగేషన్ తో మెప్పించాడా? 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఎలావుందంటే..
Advertisement

తాజా వార్తలు